జపానుచైనాల్ని గుడ్డిగా కాపీ కొట్టేయ్
అపారంగా పిల్లల్ని
ఎడాపెడా కనేయ్
థృతరాష్ఠృడే మనకిక
బ్రాండ్ అంబాసిడర్
కృషితో చూపండోయ్ పడక గదుల్లో పవర్
కృషితో చూపండోయ్ పడక గదుల్లో పవర్
చదవేస్తే వున్నమతి
చెదలు చాల పట్టింది
చంద్రబాబు చాణక్యం పడక గదికిపోయింది
చంద్రబాబు చాణక్యం పడక గదికిపోయింది
అయినా....
పిల్లలు కంటానికో
పెళ్లాం కావాలి
పెళ్ళాన్ని సాకేందుకోజాబ్ కావాలి
జాబొచ్చేందుకు ఒక ఫాక్టరీ రావాలి
ఫాక్టరీలొచ్చేందుకు ప్రత్యేక హోదా తేవాలి
పెళ్ళాన్ని సాకేందుకోజాబ్ కావాలి
జాబొచ్చేందుకు ఒక ఫాక్టరీ రావాలి
ఫాక్టరీలొచ్చేందుకు ప్రత్యేక హోదా తేవాలి
అసలు విషయం విడిచిపెట్టి
తలవదిలేసి
తోకపట్టేడు బాబు
తలతోకాలేని మాటలేల బాబూ!
తలతోకాలేని మాటలేల బాబూ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి