సాదువొక్కడు స్వప్నమున
వీక్షించె రాజ
సౌధము క్రింద స్వర్ణభాండం
కలదని, యది
సాధించ సర్కారు సై యని
త్రవ్విపోసె! అకటా
స్వర్ణ భారతి నిర్మాణమిటుల
చేయ సాద్యమా !
పది జనపథ్ క్రింద కూడ స్వర్ణము
కడు మెండు
పదిలముగా కలదని కలలు గాంచె పెక్కు
జనులు
పదవీ కాంక్ష అచట గలదు,
అదియె కడు హెచ్చు!
పదివేల వేల టన్నుల స్వర్ణము
ఏమి దాని ముందు
ప్రజాస్వామ్యము వేల వేల
టన్నుల స్వర్ణ సమానము
ప్రధమ కర్తవ్యముగ మన వోటు ఖడ్గము
చేసిన, అదియె
ప్రకంపనములు సృజియించి భరత భూమిన
చేయు
ప్రతి ప్రాంతమును బంగరు
సీమ, ఇటలి వారు యింటికెళ్ళగ
‘గాంధి’ యను పదము బంగరు
గుడ్డ్లు పెట్టు బాతు ఆయెను
వందిమాగధులను పెక్కుతెచ్చెను,
పనికిరానివారిని పదవీ
అందలము ఎక్కించెను! గాడిదలకెక్కడ
గంధము వాసనను
చందము గాదా! పనికిరాని వారికి
పదవిలిచ్చి పాలింపమనుట
చెత్త వంశాకురములకు వోటు, చోటు
నీయక, వారి బోడి
పెత్తనము అంతముగావించి,
ప్రతిభకు పట్టము గట్టి, అవ్వారి
గుత్తాదిపత్యము అంతమొందించిన
క్షణము, కలలుగన్న ఆ
కొత్త బంగారులోకం భారతమ్మున
తధ్యముగ వచ్చునదియె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి