కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్య ఓ కొత్త నిభందన పెట్టింది...
“ఉద్యోగులందరూ కార్యాలయాని బట్టలు వేసుకుని రావాలని”
క్షమించాలి ... ...
“ఉద్యోగులందరూ కార్యాలయాని గౌరవమైన బట్టలు వేసుకుని రావాలని”
మనం వేసుకునే బట్టల్లో ఎంతో మార్పు వచ్చింది... వస్తూంది...వస్తూనేవుంటుంది.
ఇప్పుడైతే బట్టలు, వాటి వ్యవహారం ఒక ప్రత్యేక పరిశ్రమ అయిపొయింది. ఒకప్పుడు బట్టలు కుట్టేవాళ్ళను దర్జీ వాళ్ళు (టైలర్)అనే వాళ్ళం. యిపుడు దర్జీలంతా దర్జాగా “ఫాషన్ డిజైనర్” లు అయి పోయారు. “ఫాషన్ డిజైనర్” లను తెలుగులో ఏమనాలో నాకు తెలియదు. “సొగసు శిల్పులు” అనాలేమో? తెలుగు నిఘంటువు లో ఫాషన్ పదానికి దగ్గరగా వున్నది యిదే నాకు తెలిసి.
భౌతిక, రసాయన, గణిత, సాంకేతిక, వైద్య శాస్త్రాల్లానే, “సొగసు శిల్ప శాస్త్రం” కూడా యిపుడు మాంచి పేరు సంపాదించింది. మన దేశంలో పూర్వం సి.వి.రామన్, రామానుజం, ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి ప్రసిద్ద శాత్రవేత్తల కాలం అయిపోయాక, యిపుడు ఈ “సొగసు శిల్పులు” ఎడా పెడా కొత్త కొత్త ఆకారల్లో (వికారాల్లో) వస్త్రాల్ని అవిష్కరించేస్తున్నారు. అవి వేసుకునే సరదా తీరక కొందరూ, వేసుకున్న వాళ్ళని చూడలేక (ఈర్ష్యతో కాదు)కొందరూ బాధ పడుతున్నారు...అది వేరే విషయం.
యిపుడు టివీ ల్లో ఎక్కడ చూసినా “పిల్లి నడకలు” (క్యాట్ వాక్) ప్రోగ్రాములే.
ఈ పిల్లి నడకల్లో సదరు సొగసు శిల్పులు “కనిపెట్టిన” వస్త్రాలు వేసుకుని నడుస్తూ వుంటారు. సర్వసాదారణంగా వాళ్ళు దుప్పటిని యిష్టమున్నట్టు కిందా పైనా వేసేసుకుని, తల మీద ఒక ముళ్ళ కంచో లేక పొతే ఒక కాబేజీ పువ్వో పెట్టుకుని వుంటారు. వారి ముఖ కవళికలు, అపుడే ఎవర్నో తాజాగా హత్య చేసి వచ్చినట్టు వుంటాయి. అలా వారు నడుస్తూంటే..ఆ పక్కా ఈ పక్కా అందరూ కూర్చొని ,చప్పట్లు కొడుతూ వాళ్లకి మార్కులేస్తూ వుంటారు, అసలు బట్టలువేసుకునే వాళ్ళని ఎపుడూ చూడనట్టుగా.
లంగా వోణీలు పోయి, చుడీదారు లు పోయి యిపుడు టి షర్ట్లు, జీన్లు వద్దకి వచ్చాం.
మహానగారాల్లోనైతే యిపుడు నడుమునించి కాలిమడమల వరకూ పెద్ద మేజోళ్ళు (సాక్స్) లాంటివి వేసుకోవటం ఫాషన్. ఒకపుడు మేజోళ్ళు పాదాలకి మాత్రమె వేస్కునేవారు. యిపుడు నడుము నుంచి కాల్లవరకుకూడా పెద్ద మేజోళ్ళు వేసుకుంటున్నారు.ఈ పెద్ద మేజోళ్ళను టైట్స్ అంటారని ఈ మధ్యే తెలిసింది. బ్రహ్మ ఏ.. ఏ. భాగాల్లో ఏ.. ఏ ..మలుపులతో శరీరాన్ని ఎలా డిజైన్ చేసాడో అన్నీ కూడా ఎక్కడా దాచుకోకుండా ఈ వస్త్రములు ప్రదర్శిస్తాయి
ఈ వస్త్రధారణ లో హద్దులు పెట్టటం ఎవైరికైనా కష్టతరమే. స్వతంత్ర భారత దేశంలో ఆ మాత్రం స్వాతంత్రం కూడా లేకపోతె కష్టమే. అయితే ఒకరి స్వాతంత్రం యింకొకరి స్వాతంత్రాన్ని యిబ్బంది పెట్టకూడదు. ఈ ప్రాతిపదిక మీదనే కాబోలు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిభందన పెట్టింది.
వలువలు పధ్ధతిగనుండవలెనంటిరి కర్ణాటకమున
విలువలు హెచ్చునట్లుండవలెనన్నయది కర్ణకఠోరమా?
పలువిధముల వస్త్రధారణ కంటికి యింపు సరియే,
మేలుపద్ధతి వస్త్రధారణయది వంటిని
కూడకొద్దిగ దాచున్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి