14, ఏప్రిల్ 2013, ఆదివారం

సావిత్రి మరల పుట్టినా తెలుగు సినిమాలో ఆమెకి అవకాశం రాదు


నేటి తెలుగు సినిమాలో హీరో అనగ ఎవరోయి
నటన దురద పట్టిన నిర్మాత కొడుకో, మేనల్లుడోనోయి

డబ్బు పెట్టి సినిమా చూసే ప్రేక్షకుడొక పిచ్చి మారాజు  
గబ్బు హీరోగాళ్ళతోనే తమ కళ్ళు పొడుచుకుంటాడు  

కాకి పిల్ల కాకికి ముద్దే, నిర్మాతకి వాడి కొడుకూ ముద్దే
కాని సొల్లుగాళ్ళను ప్రేక్షకుల మీద రుద్దుడుకు ఏదీ హద్దు !

ఎడారిలో ఎండమావులే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు
లొడాయి హీరోగాళ్ళకు ఉత్తరాది వారి ఆడే బొమ్మలే ఆభరణాలు  

కంటికింపయిన తెలుగు వనితలు వెండితెర మీన కానగరారు! ఎందుకో ?  
యింటి యిల్లాలును వదిలి వీధిలోన వెలయాలి పట్టు చందము, ఎందుకో ?

సావిత్రి మరల పుట్టినా తెలుగు సినిమాలో ఆమెకి అవకాశం రాదు
ధరిత్రి మొత్తానికి యింత దరిద్రం ఏ జాతి లోనూ కనిపించే అవకాశం లేదు

1 కామెంట్‌: