20, ఏప్రిల్ 2013, శనివారం

అయిదేళ్ళ పాపాయి మీద అత్యాచారం ! అయిదేళ్ళకోసారి ఎన్నికల అత్యాచారం !



అత్యాచారం ! అత్యాచారం !
అత్యాచారం ! అత్యాచారం !
 

అయిదేళ్ళ పాపాయి మీద అత్యాచారం !
అయిదేళ్ళకోసారి ఎన్నికల అత్యాచారం !

ఓటు విలువను నమ్మని అత్యాచారం !
ఓటు వలువలూడదీసిన అత్యాచారం !

ఓటు విలువను నమ్మని అత్యాచారం !
ఓటుకు విలువ కట్టి అమ్మేసే అత్యాచారం !

ఓటును కొనేసే అరాజకీయ నాయకుల అత్యాచారం !
నోటులు ఓటును పోటు పొడిచి చేసే అత్యాచారం !

పొద్దున్న ఆరింటికి సారా కొట్టు తెరిచే అత్యాచారం !
వద్దన్నా సారా కోట్లు పెట్టే ప్రభుత్వ అత్యాచారం !

మత్తుకి చిత్తయిపోయి, ఆ మత్తుకి
సొత్తు కోసం హత్యలు చేసే అత్యాచారం !

తిరుపతిలో వీధి వీధికీ పెట్టిన బ్రాందీ కొట్ల అత్యాచారం !
తిరుగులేనిదీ తరుగులేనిదీ ఈ ప్రభుత్వ మత్తు వ్యాపారం

వారసత్వం రాజకీయ పక్షాలను శాసించే అత్యాచారం !
బానిసత్వం ఆచరిచంచే కుహనా నాయకుల అత్యాచారం !




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి