12, ఏప్రిల్ 2013, శుక్రవారం

నంది అవార్డులు...మధ్యలోనే చెక్కేసిన హీరోలు : కిరణ్ కుమార్ రెడ్డి అలక


నంది అవార్డులు, మధ్యలోనే చెక్కేసిన హీరోలు : కిరణ్ కుమార్ రెడ్డి అలక

నిన్న నంది అవార్డు ఫంక్షన్ అయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారని వినికిడి.
ప్రధానంగా దీనికి కారణాలు రెండు:
ఒకటి: హీరోలు అవార్డులు అందుకున్న వెంటనే, CM యింకా సభలోనే వున్నాడని కూడా చూడకుండా, హీరోలు వెళ్ళిపోవటం 
రెండు: హీరోలు వెళ్లి పోవటం తో సభలో జనం కూడా వెళ్లి పోవటంతో, CMకి ఉపన్యాసం యిచ్చే అవకాశం రాకపోవటం
ఈ సంఘటన అయిన వెంటనే CM కాంగ్రెస్ పార్టీ మీటింగు ఒకటి అర్జంట్ గా పెట్టేసి డిస్కషన్ మొదలెట్టాడు.
కిరణ్ : ఈ హీరోలు అందరూ మన్మిచ్చిన అవార్డులు తీస్కోని చెక్కేశారు. యిది ఎంత మాత్రం బాగ్ లేదని మనవి చేస్త్నాను. వీళ్ళందరికీ ఎకరాల మీద ఎకరాలు స్టూడియోల్కి భూములు యిచ్చినం, అయినా ఎంద్కు యిలా చేస్త్నారు
బొత్స : కిరణ్, నీకేటి అర్ధమవదు, వాళ్ళు ఆ స్టూడియో భూమిల్ని సినిమా హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ లుగా మార్చి, ఏవో తతంగాలు చేసి , వాళ్ళ వాళ్ళ టివి చానేల్సు పెట్టుకుని, వాళ్ళే అవార్డులు పెట్టుకొని , యిచ్చుకొంతున్నారు, యింక ఈ బోడి నంది అవార్డులు ఎవడిక్కి కావాలి . వాళ్ళ అవార్డ్ ఫంక్షన్లో అయిటం సాంగ్స్ ఉంటాయ్ చూట్టంకి. నిన్ను, నన్ను చూట్టన్కి ఎవడోస్తాడేటి?  
      
కిరణ్ : అయితే ఒక అయిడియా ! వీళ్ళని ఎదుర్కొటాన్కి, వీళ్ళకి పోటీగా మనమే ప్రభుత్వం తరపున సిన్మాల్ తీద్దాం
‘ఇందిరమ్మ సినిమా హస్తం ‘ అని కొత్త స్కీం పెట్టేద్దాం. దానిద్వారా తీసే సినిమా కి ‘ఇందిర ఒక హస్తం, రాహుల్ ఒక రుస్తుమ్’ అని టైటిల్ పెట్టేద్దాం. వచ్చే ఏడాది నంది అవార్డులు అన్నీ ఈ సిన్మాకే యిచ్చేద్దాము. ఓకే తూటాకి రెండు పిట్టలు అంటే యిదే. ఈ తెలుగు హీరోలకి దీంతో తిక్క కుదురుతుంది, దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రచారం కూడా అయితది.
బొత్స :  అయిడియా బానేవుంది, అయితే దీనికి డైరక్షన్ నేనే చేస్తా. హీరో నాచురల్ గా రాహుల్నే పెడతా.
మల్లికా షెరావత్ ని పెట్టి ఒక అయిటం సాంగ్ కూడా పెట్టి, ఇటలీలో సాంగ్స్ అన్నీ తీస్తా. మల్లికా దెబ్బకి వారం తిరక్కుండా రాహుల్ పెళ్లి చేసేస్కుంటాడు...దాంతో  ఒక ఏడాది లో రాహుల్కి కొడుకు పుట్టేస్తాడు. దాంతో
2050 వ సంవత్సరానికల్లా,  కాంగ్రెస్ కి పార్టీ ప్రెసిడెంటు కూడా దొరుకుతాడు, దేశానికి ఇందిరా వంశాంకురం నాయకత్వం కూడా దొరుకుతుంది.
కిరణ్ : వెరీ గుడ్... యిన్నాల్కి నీకు నాకు మద్య గొడవ లేకుండా ఒక టాపిక్ దొరికింది. రేపు పొద్దున్నే మొదటి ఫ్లైట్ లో డిల్లీకి వెళ్లి పోయి మేడం గార్కి ఈ విషయం సమర్పించుకుందాం .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి