తెలుగు నేల తాగి, తాగి తూలీ పోతోంది
తెలుగు నేల తాగి, తాగి చేల రేగి పోతోంది
తెనాలి నేడు తాగి, తాగి, తాగి... ఒక కూతుర్ని వేధించింది
తెనాలి నేడు తాగి, తాగి., తాగి .. ఒక తల్లిని చంపేసింది
తెనాలి నేడు తాగి,
తాగి ఒక మౌనిక మానంతో చెలగాటమాడింది
తెనాలి నేడు తాగి, తాగి ఒక అమ్మ ప్రాణాన్ని విస్కీ తో నంచుకు తినేసింది
గాంధీ చౌక్ లో కరమ్ చంద్ గాంధీ సాక్షిగా మద్యపాన వినోదం సాగుతోంది, నేటి
గాంధీలు చవక అయిపోయి, చవట నేతల ఆరాధ్యమయమయిపోయారు
మంచి నీరు దాహానికి లేక బ్రతుకులు హరించి పోతున్నాయ్
మందు మాత్రం దావాలానంలా దహించి పారేస్తోంది, పారుతోంది
తెనాలి ఆంధ్రా పారిస్ నా !
తెనాలి బ్రాందీ పారిస్ నా ?
ప్రభుత్వ ఖజానాకి కాసుల కార్ఖానాల్ బ్రాందీ షాపులు
ప్రజల ఖలేజాలకి కామెర్లకీ కార్ఖానాల్ బ్రాందీ షాపులు
తెలుగు నేల తాగి, తాగి తూలీ పోతోంది
తెలుగు నేల తాగి, తాగి చేల రేగి పోతోంది
veellandarini kooda lorry la krindaki thoseyandi..
రిప్లయితొలగించండిthaagatam oka fashion, thaganodu enduku panikirani vedhava annatle choopisthunnaru ee madhya cinemallo..
idee mana dourbhagyam..
well said.
రిప్లయితొలగించండిall liquor sales shall be nationalized, run by government, and there should not be any liquor shops in main streets and markets.