6, ఏప్రిల్ 2013, శనివారం

“రాహుల్ గాంధీ-ఒక DNA యువరాజు : భారత దేశంలో నీటి సమస్య”


“రాహుల్ గాంధీ-ఒక DNA యువరాజు : భారత దేశంలో నీటి సమస్య”

ఈ క్రింది ఆర్టికల్ కి యిది నా స్వేచ్చనువాదము


Rahul Gandhi holds no water, can’t lead India, By Praveen Patilfrom http://www.niticentral.com
*****Start of the Article *****
వెనకటికి, రాజీవ్ గాంధి గొప్పలు తిప్పలు పడుతున్న రోజుల్లో అతని ఇండియా పర్యటన మీద చాల జోకులు ప్రాచుర్యంలో వుండేవి. శరద్ జోషి  అని ప్రాచుర్యం గల వ్యంగ రచయత "నీటి సమస్య" అని ఒక నాటిక వ్రాశాడు. ఆ నాటిక లో రాజీవ్ గాంధి ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ,
రాజీవ్ : మీకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి
గ్రామస్తులు : నది నుంచి
రాజీవ్ : మీరు నదికి నడిచి వెళ్తారా లేక టాక్సీ లో వెళ్తారా?
గ్రామస్తులు: నడిచి
రాజీవ్ : ఓ అలానా.. అయితే మీరి నీళ్ళు యింటికి తెచ్చే సరికి అవి వేడెక్కి పోతాయి కదా?
గ్రామస్తులు : అవును 
అపుడు రాజీవ్ గాంధి ఒక ప్రభుత్వాధికారిని పిలిచి యిలా చెప్తాడు : ప్రపంచ బ్యాంకు నుండి సహాయం కోరి నది మీద షెడ్ ఏర్పాటు చేయండి, నీళ్ళు వేడెక్కకుండా.

పైన చెప్పింది తల్వీన్ సింగ్ రచించిన 'దర్బార్' అనే పుస్తకం నుంచి ఒక భాగం. యిది చదివినపుడు గాంధీల వ్యవహారం ముప్పై  సంవత్సరాల క్రితంకి యిప్పటికి అలానే వుందని అనిపిస్తుంది. రాజీవ్ గాంధి ఎలా అయితే ప్రతిభ లేకుండా  వ్యవహరించాడో అలానే రాహుల్ గాంధి కూడా ఒక అంధకారం లో ప్రయాణిస్తున్నాడు. కొన్ని వీర్యపు చుక్కలకు పట్టిన అదృష్టం వంద కోట్ల నిస్సహాయుల మీద రాజ్యం చేసినపుడు యిదే అవుతుంది. 
 
రాజీవ్ వంశపారంపర్యపు లబ్ది పొందిన ముప్పై సంవత్సరాల తరువాత, నీటి గురించి సరిగ్గా  అదే ప్రశ్న కొడుకు రాహుల్ కి కూడా వచ్చింది.  ద్రువ్ సోని అని CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ యిండియన్ ఇండస్ట్రీస్) పూర్వ ప్రెసిడెంట్ రాహుల్ని అడిగాడు యిలా : “ నీరు మరియు, మురుగు నీరు భారత దేశపు ప్రధాన సమస్యలు. మనకి ఈ సమస్యల మీద సరియిన అవగాహన లేదు. పంజాబ్ లో నీళ్ళలో యురేనిం వుంది, వెస్ట్ బెంగాల్ నీళ్ళలో ఆర్సెనిక్ వుంది. మనము ఈ సమస్యల్ని అతి త్వరగా అర్ధం చేసు కోవాలి. మీరు చెప్పిన బాగస్వామపు పద్దతి లో సభ్య సమాజము, వ్యాపారవేత్తలు, ప్రభుత్వమూ కలసి పనిచేయటానికి యిది ఒక గొప్ప అవకాశము, ఉదాహరణ కాదా?”
యిక్కడ ఒక వ్యాపారవేత్త,  భవిష్యత్తు లో భారత ప్రధాని కాగల వ్యక్తిని ఒక మార్గదర్శకత్వం, విధానము సూచించమని అడుగుతున్నాడు.
ఈ ప్రశ్న, సందర్భము ‘యువ’ గాంధీ వంశాంకురానికి ఒక గొప్ప అవకాశం, తన జ్జ్ఞానాన్ని, ముందుచూపును యిండియా కి చెప్పటానికి.
రాహుల్ ఈ ప్రశ్న కి సమాధానం చెప్పి, తద్వారా ప్రజల్లో తనమీద వున్న ముద్రను మార్చు కోవటానికి యిది ఒక అవకాశం. యిటువంటి సదవకాశం సాధారణంగా నేతలకు రాదు.
రాహుల్ గాంధీ ఈ ప్రశ్నకు యిలా బదులిచ్చాడు :
“యిది ఒక ముఖ్యమైన ప్రశ్న, కాని నీటి సమస్య ఒకటే మన సమస్య కాదు, ప్రతి విషయం ముఖ్యమే, విశ్వ విద్యాలయపు పాఠ్య అంశాలు ముఖ్యమే.”

యిక్కడే శ్రోతలు విస్తుపోయారు.  విశ్వ విద్యాలయపు పాఠ్య అంశాలకి నీటి సమస్యలకి సంబంధం ఏమిటి?
శరద్ జోషి ఈ యొక్క గాంధీల రోగాన్ని  ముప్పై ఏళ్ల క్రితం కనుగొన్నాడు... రాజీవ్ నదులమీద షెడ్ వేయమని అన్నపుడు. ఈ గాంధీలు సమస్యలని గ్రహించ లేరు... అర్ధం కావు, పాపం వారికి సమస్యలు అర్ధం కావు.
భారతీయులు యిలా గాంధీల నుంచి సమాధానాలు కోరుకోవటం వారి మూర్ఖత్వం.

ఈ నీటి సమస్య ప్రశ్నకి, రాహుల్ గాంధీ 30 నిమిషాలపాటు యిచ్చాడు. అవును మీరు చదివింది నిజమే. అతను అర్ధగంట సమయం తీసుకున్నాడు, తన నీటి విధానాన్ని విశదీకరించటానికి. ఈ  30 నిమిషాల సమాధానం లో
యూత్ కాంగ్రెస్, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు, పార్లమెంట్ మెంబర్లు, ఎమెల్యేలు, స్పానిష్ క్లబ్లు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ గురించి చెప్పాడు, యింకా చైనా గురించి చెప్పాడు. ప్రపంచంలో అన్ని విషయాల గురించీ మాట్లాడాడు...ఒక్క నీటి సమస్యలు తప్ప. తన 30 నిమిషాల సమాధానం లో కనీసం ఒక్కసారి కూడా ‘నీరు’ పదాన్ని ఎత్తలేదు.

రాజీవ్ గాంధీ, అతని డూన్ స్కూల్ స్నేహ సమూహం యిండియా యొక్క అసలు నాయకులు. వాళ్ళు పంజాబ్ లో ఖలిస్తాన్ సమస్య నుంచి, కాశ్మీర్ వేర్పాటు సమస్య నుంచి, కాశ్మీరి పండిట్ల నిష్క్రమణ నుంచి, షాబానో సమస్య నుంచి అయోధ్య సమస్య వరకు అన్ని సమస్యల పరిష్కారాలలో తప్పులు చేశారు. వాళ్ళు సంస్కరణలను జాప్యం చేసారు. ఆలోచించండి.  రాజీవ్ వదిలేసిన సమస్యల్ని పరిష్కరించటానికి యిండియా కి దశాబ్దాలు పట్టింది.
యిప్పటికీ మనం సమస్యలతో సతమతమవుతున్నాం. ఏ ఒక్క భారత దేశపు నేత కూడా యిటువంటి మచ్చలని భారత దేశానికి యివ్వలేదు. కాంగ్రెస్స్ ఈ ఒక్క వైఫల్యాల్ని తన విజయలుగా చెప్పుకుంటోంది.
ఒక్క సారి ఆలోచించండి, రాహుల్ గాంధీ దేశాధినేత అయితే వచ్చే సమస్యలు. ఆ ఆలోచనే వెన్నులో చలి పుట్టిస్తుంది. మీరు CII కాంక్లేవ్ లో రాహుల్ ని వినివుంటే మీకు అర్ధమయ్యే వుంటుంది, మనము ఎవరిని వింటున్నామో.
అతనికి హేతుబద్ద ఆలోచనలు లేవు, ఇండియా సమస్యలు అతనికి అర్ధం కావు. అధోగతి చెందిన రాజీవ్ జన్యువుకు ప్రాతినిద్యం వహించిన, భారత్ తో సంభంధం లేని ఒక ‘యువరాజు’ అతను.  
యిండియా మరోసారి మరో రాజీవ్ ని భరించలేదు. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న ఒక దేశానికి, డిల్లీ లో యిటువంటి ఒక కొత్త సమూహపు నాయకత్వం దేశానికి అధోగతి చూపుతుంది.
చరిత్ర పునరావృత్తం అవటానికి వీలు యివ్వరాదు...యిప్పుడు, ఈ సారి.. బహుశా ప్రతిసారి.
***End of the Article *****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి