వెళ్ళిపోయింది ...ఈ కుళ్ళిపోయిన సమాజాన్నించి
వెళ్ళిపోయింది ...తనని సమాధి చేసిన సమాజాన్నించి
రేపుల రాజ్యం నుంచి.. వెళ్ళిపోయింది
రేపే లేని రావణ రాజ్యం నుంచి.. వెళ్ళిపోయింది
నీచ కీచక నిశా కీకారణ్య మానవ మృగాల బారినపడి .. వెళ్ళిపోయింది
నీతి లేని...మానవత్వం లేని దిగజారిన లేకి సమాజాన్నించి .. వెళ్ళిపోయింది
అత్యాచారాల రాజధానిలో మరో కూతురు అంతం అయిపోయింది
అంతులేని మానభంగాల అససేష కిరాతక యాగంలొ సమిధ అయిపోయింది
హీన నీచ నికృష్ట మానవ పిశాచాల కామానికి బలి అయి వెళ్ళిపోయింది
మానాన్ని, రక్తాన్ని, ప్రేగుల్ని...ప్రాణాన్ని...తీసేసిన సమాజాన్నించి .. వెళ్ళిపోయింది
అశ్రుతర్పణం తప్ప ఏమీ చేయలేని దౌర్భాగ్యము మాది
సహస్ర సహస్ర సహస్రాల అంధ ధృతరాష్ట్రుల
సమాజము మనది
నీ మరణ వార్త విని జారాయి కన్నీటి బొట్లు
నీవు లేవనే, రావనే చేదు నిజం..మా దౌర్భాగ్యం
నీవర్పించిన ప్రాణ దీపం చూపాలి వెలుగు బాట
నీవర్పించిన ప్రాణం కావాలో తిరుగుబాటు బావుటా
ఎంతమంది వెలుగు బాటలు పరచినా గుడ్డి సమాజానికి ఉపయోగమేముంది? ఎన్ని తిరుగుబాటు బావుటాలు ఎగిరినా రాతి గుండె పాలకుల కళ్ళు తెరిపించగలవా? రవీంద్రులు, కవీంద్రులు కన్నీరు కార్చాలే తప్ప, షిండేలూ, మౌనమోహనులూ ఏం చేయలేరు మిత్రమా. నివాళి అర్పించాలన్నా సిగ్గుగా ఉంది.
రిప్లయితొలగించండి