ఆకలి కేకల ఆక్రందన లో, ఆశల ఎండిన కన్నులలో
పేగున నిండిన శూన్యం లో, అనాధ బతుకుల కేకలలో
కనిపించలేదా భరత దేశ భావితరపు భవిత
వినిపించలేదా భరత మాత ఆక్రందన అరుపు
బడినే చూడని బడుగు బిడ్డల కళ్ళల్లో
పాఠం చెప్పని పాఠశాల పాకల్లో
కనిపించలేదా, రేపు లేని బడుగు బిడ్డ భవిత
వినిపించలేదా, రేపు వచ్చు బ్రతుకులోన చిచ్చు
మూత్రశాల లేని పాఠశాల కెళ్ళ లేక
ఆడబిడ్డ యింటి వద్ద నుండి పొతే
కనిపించలేదా, ఆడబిడ్డ అవసరం
వినిపించ లేదా ఆడతల్లి ఆగ్రహం
పగలు రాత్రి మందు కొట్టి
యింటికొచ్చి భార్యని తిట్టి, కొట్టు కొజ్జా లుంటే
కనిపించ లేదా సారాకొట్టు కార్చిచ్చు
వినిపించ లేదా ఆలి, అమ్మ రోదన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి