అద్భుతమయిన
దేశ భక్తి సినిమా “అల్లూరి
సీతారామ రాజు’’ లో
ఈ పాట విన్నపుడు దేశభక్తి
ప్రతి మనిషికీ కలుగుతుంది
యిప్పటి పరిస్థితుల్లో ఈ
పాట యిలా పాడుకోవాలేమో అనిపించింది ...
రగిలింది విషపు అగ్ని ఈ రోజు
ఆ అగ్నిపేరు అవినీతే తెలుసుకో ఈ రోజు
రగిలింది విషపు అగ్ని ఈ రోజు
ఆ అగ్నిపేరు అవినీతే తెలుసుకో ఈ రోజు
బొగ్గులోన, టుజి లోన, కొల్లగొట్టె మన నేత
నల్ల డబ్బె దాగిందీ స్విస్ బ్యాంకు ఖాతాన
నలిగెను భరత మాత కుటిల నేత పాపాన
తలచి తలచి వెయ్యవోయి ఈ సారి నీ వోటు
రగిలింది విషపు అగ్ని ఈ రోజు
ఆ అగ్నిపేరు అవినీతే తెలుసుకో ఈ రోజు
భరత దేశ భవితవ్యం కుళ్ళు రోత చేయొద్దు
మంచి నేతనెన్ను కొని మార్చేద్దాం దేశాన్ని
కళ్ళు తెరిచి మేలుకొంటె మనదే రాజ్యం
జపియించు, జపియించు ...వందే మాతరం ... వందే మాతరం .. వందే మాతరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి