ఈ రోజు సాయింత్రం నా స్నేహితుడు "నాగభైరవ" విచార వదనం తో వుండటం
చూసి, "ఎమయిందిరా, ఒంట్లొ బాగా లేదా" అని అడిగా.
తల పైకి ఎత్తి నా కళ్ళలోకి ఒక్క నిమిషం మౌనంగా చూసి, అమాతంగా ఒక్క పళాన వచ్చి నన్ను వాటేసుకుని, భోరున ఏడవటం మొదలెట్టాడు
"ఎమయిందిరా" అని అడిగా
"ఏమి చెప్పేదిరా... నా ఆశలన్నీ నాశనమయి పొయాయ్ రా... ఛీ వెదవ
బ్రతుకు...యిలాంటి రోజు వస్తుందని కలలొ కూద వూహించ లేదురా" అన్నాడు.
నాకు విసుగొచ్చి, "నీ యబ్బ ...ఆ
ఎడుపు ఆపి ఎమైందో చెప్పరా.. మళ్ళీ అన్ని సబ్జక్టుల్లొనూ ఫైల్ అయ్యావా...
యింతకుముందు కూడా చాలా సార్లు యిలా ఫైల్ అయ్యావు కాదా..యిది నీకేమీ కొత్త
కాదుగా" అన్నా
“బోడి ఎగ్జామ్స్
గురించి కాదురా నా బాధ. అయినా ఏమయిందని ఎంత కూల్ గా అలా ఎలా అంటున్నావ్ రా...న్యూస్
లో చూడలేదా.. ఢమరుకం యివాళ రిలీజ్ కాదట ” అన్నాడు నాగ
భైరవ అదేదో కలియుగాంతం వచ్చినట్లుగా.
యింతలో నాగ భైరవ వాళ్ళ అమ్మ గారు వచ్చి అన్నారు నాతొ, “బాబూ, మా నాగభైరవ ,
అదేదో ఢమరుకమో, డప్పో, డోలో సినీమా రిలీజ్ అవలేదుట ..దాని గురించి పొద్దున్నించీ
ఒకటే పిచ్చాడులా అయిపోయాడు..పచ్చి మంచినీళ్ళు కూడా తాగాట్లా... వెధవ... వీడికి ఈ
పిచ్చి ఎలా వచ్చిందో తెలియదు”
ఆ కన్న తల్లి భాద చూస్తే నాకే చాలా భాదేసింది. అసలు మా స్నేహితుని ఒరిజినల్ పేరు
కృష్ణ ప్రసాద్. ఈ సదరు కృష్ణ ప్రసాద్, అదేదో నాగార్జున సినీమా ఏభయ్ రోజులు ఆడితే తన
పేరు మార్చేసు కుంటానని మొక్కు పెట్టుకుని, అ సినీమా ఏభయ్ రోజులు ఆడినందుకు తన
పేరుని నాగభైరవ అని మార్చేసుకున్నాడు.
రేప్పొద్దున్న పొరబాటున ఆ డమరుకం రిలీజ్ కాకపోయినా , సరిగా ఆడక పోయినా వీడు ఆత్మాహుతి
చేసేసు కుంటాడేమోనని కొద్దిగా భయం కూడా వేసింది.
ఒక వేళ వీడు ఆత్మాహుతి చేసుకొంటే, వీడి కోసం మళ్ళీ ఓదార్పు యాత్రలూ, పాద
యాత్రలూ అన్నీ కళ్ళముందు కదిలాయి.
యిక నేను నా వంతు ప్రయత్నం చేసి వీడిని మార్చేందుకు ప్రయత్నం చేయకపొతే ఏమయినా
ప్రమాదం జరిగే పరిస్తితి కి వచ్చేసాడని అర్ధమయింది నాకు.
నేను వాడితో అన్నా, “ఒరేయ్, నువ్ అనుకుంటున్నట్టు ఈ సినిమా హీరో లందరూ ఏమీ
సూపర్ మేన్ లు కాదు. ఆ హీరో మన్మధుడూ, ఈ హీరో సూపర్ మాన్ అని మనం అనుకునేట్లు ఈ
టీవి చానెళ్ళు బాకావూదటమే గానీ, నిజానికి అంత సీన్ ఏమీ వుండదు. వాళ్ళు యిరవై నాలుగ్గంటలూ
విగ్ లు పెట్టుకొని, పండిపోయిన తలకి నల్లరంగు పూసుకుని అలా తయారవుతారు. ఆ మేకప్
నీకేసినా నాకేసినా మనం కూడా మన్మధుడు లానే వుంటాము. అసలా ఆ మధ్య మీ హీరో తిరుపతి
లో శుబ్రంగా చక్కగా తన నిజమయిన తెల్లని జుట్టు తో నిగ నిగ లాడుతూ కనిపిస్తే చూళ్ళా
నువ్వూ ?
మా నాన్న కీ, మీ నాన్నకీ ఒక సినిమా స్టూడియో వుంటే నువ్వూ నేనూ కూడా పెద్ద
హీరోల్లా అయిపోయి వుండే వాళ్ళం. నూతిలోంచి వాయిస్ వచ్చినట్లుగా మాట్లాడే వాడొకడయితే,
ముద్ద ముద్దగ మాట్లాడే వాడొకడు. వీళ్ళ కోసం ఎందుకురా నీకు ఈ పిచ్చి’’ అన్నాను.
దానికి నాగ భైరవ్ యిలా అన్నాడు, “ నా ఫేవరేట్ హీరోని అలా అనకు, ఎంత గొప్ప
నటుడు కాక పొతే , ఈ టీవి చానెళ్ళు ఎపుడూ ఆ హీరోనే చూపిస్తూ, ఆ హీరోనే పొగుడుతూ
వుంటాయి ?”
నేను అన్నా ఆవేశంగా...“నీ అమాయికత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియట్లా, ఆ టీవి
చానాళ్ళన్నీ ఆ హీరోలవే లేదా అ హీరోల కి దగ్గరయిన వాళ్ళవే. వాళ్ళు క్రియేట్ చేసిన
హైపే అంటా యిది. ఏ నిర్మాత ఎపుడు సినిమా మొదలెడతాడు, ఆ సినిమా టైటిల్ ఏమి పెడతాడు,
ఈ టైటిల్ అయితే నప్పుద్ది, ఎపుడు సినిమా రిలీజ్ అవుతుంది- ఈ విషయాలతో ప్రతీ రోజూ
బ్రెయిన్ వాష్ చేసి, సినీమా మెదడు వాపు వ్యాది సృష్టించి వాళ్ళ బిజినెస్ పెంచుకుంటున్నారు. ఈ సినిమా మత్తులో
నే అందర్నీ నాన్చి పెడుతున్నారు. యిక సినీమానే సర్వస్వం అన్నట్లు, అన్ని టీవి
ప్రోగ్రామ్సూ సినిమా ఆధారిత ప్రోగ్రామ్స్ మాత్రమే చూపెడుతున్నారు. వుదాహరణకి “కౌన్ బనేగా కరోర్ పతి” లాంటి జనరల్ నాలెడ్జి
ప్రోగ్రామ్స్ హిందీలో వస్తున్నాయ్, తమిళ్
లో వచ్చాయి, తెలుగులో మాత్రం రాలేదు...రావు కూడా. ఎంతసేపూ ఆ సినిమా హీరో పుట్టిన
రోజు, ఈ హీరో పెళ్లి రోజు యివే మన ప్రోగ్రామ్సు. యిక హీరో లయితే వంశ పారంపర్యమే,
తాత –కొడుకు-మనమడు-మునిమనముడు. తినగ తినగ వేప తియ్యనగును అన్నట్లు ఈ వంశ పారంపరిక
హీరోలని చూసి చూసి ప్రజలు మనకు గతి
యింతేనని సరి పెట్టేసుకున్నారు. వీళ్ళ సరసన హీరోయిన్లు మాత్రము నార్త్ యిండియా
నుంచో, ముంబాయి నుంచో వచ్చిన యిమ్ పోర్ట్ అయిన భామలే కావాలి. యిదే మనము మన తెలుగు
యువతులకు యిచ్చే అవకాశాలు.”
నేను చెప్పినదంతా విన్న నాగభైరవ ఒక్కసారిగా
లేచి నించున్నాడు. నాకు అనిపించింది వీడి లో ఏదో మార్పు వచ్చింది అని.
నాగభైరవ యిలా అనేసి వెళ్ళిపోయాడు : “ మా ఫేవరేట్ హీరోకి నీ లాంటి వాళ్ళ దిష్టి
తగిలేసింది. మా హీరో కట్ ఔట్ కి పాలాభిషేకం చేస్తే గాని ఆ దోషం పోదు. అర్జంట్ గా ఆ
పని చెయ్యాలి “
bagundi brother.
రిప్లయితొలగించండి