అత్యాచారాలు ఆచారలైపోయాయ్ హీన హస్తినాపురిన
ఆకతాయిల అకృత్యాలు వెల్లువైనవి...ఘొల్లుమనే
ఆడపిల్లల గోల అరణ్య రోదనలైనవి, రోజు వారీ గాధలైనవి
మద్య మిచ్చిన మత్తులో దుష్టశక్తులు రెచ్చిపోతే
మార్ఫీనిచ్చిన మదములో దుశ్శాశనులు రేగిపోతే
చాలీ చాలని పోలీస్ వారు, ఏమీ చేయలేరు
చల్తాహై అని సర్దుకుపోయే సగటువారూ ఏమీ చేయలేరు
పట్టుకుంటే పన్నెండు మాసాలు జైలేగా అనే భరోసాయిచ్చే చట్టాలు
పట్టించుకునే సమయం లేని లొక్ సభా, శాసన సభా పర్వాలు
కోట్ల రూపాయలు స్కాముల్లో కొట్టుకు పొతాయి, ఏభయ్
కోట్ల ఆడవాళ్ళ భద్రతకి అంతులేని అడ్డంకు లొస్తాయ్
మరో రేపు వస్తుంది , మరో రేప్ అవుతుంది
మరో రోజు వస్తుంది, మరో మోజు మస్తీ మొదలవుతుంది
అకృత్యం మన నిత్యకృత్యం
అవినీతి మన నిత్య శోభ
ఆవేశం ఒక్క రోజులొ అస్తమిస్తుంది
ఆక్రోశం మరో రోజులొ ఆగిపోతుంది
న్యూస్ లొ మరో ఊసు గా మిగిలిపోతుంది
ఫూల్స్ లా చూస్తూ మరిచిపోతాము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి