20, ఆగస్టు 2012, సోమవారం

తెల్లదొరల కాలంలో మహాత్ముడు జైలుకు వెళ్లారు, నల్ల దొరల కాలంలో ...


గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం
యిది గడిచిన ఘనతకు సంకేతం
యిది మరచిన నడతకు  సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
ప్రతి నేతా పాప కూపమే సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబ్ నేతా కో సన్మది దే భగవాన్


భూములనన్నీ దోచీ, దేశాన్నంతా మేస్తే 
మనిషి మనిషిగా బ్రతకాలా?...ఈనాడు నూతి లో దూకి చావాలా ?
మనిషి మనిషిగా బ్రతకాలా?...ఈనాడు నూతి లో దూకి చావాలా ?

బాపూ ... ఈ దోపిడీ ఆపె వరమే మాకివ్వు     
అవినీతిని గెలిచే బలమివ్వు... అవినీతిని గెలిచే బలమివ్వు

ప్రజలకు భ్రాంతే శాంతి.. కలలోనే మిగిలే సౌఖ్యం.
ప్రజలకు భ్రాంతే శాంతి.. కలలోనే మిగిలే సౌఖ్యం.

భారత భావం మది లో కదిలి
ఈ జాతి నిలిచిన నాడె..అది జాతి
బాపూ... నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు... నీ బాటను నడిచే బలమివ్వు...

గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం
యిది గడిచిన ఘనతకు సంకేతం
యిది మరచిన నడతకు  సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
ప్రతి నేతా పాప కూపమే సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబ్ నేతా కో సన్మది దే భగవాన్


గాంధీ తత్త్వం తెలిసి...తెల్ల దొరల కరడు మనసులె కదిలె ఆనాడు
గాంధీ తత్త్వం తెలియక...ఒక నల్ల దొర పేలె కుళ్లు కూతలు ఈనాడు

గాంధీ తో పోల్చిన మాత్రాన... ఎవడూ గాంధీ కాలేడు

దేశం కోసం, ప్రజల కోసం గాంధీ జైలుకి వెళ్లాడు
డబ్బు దొబ్బినందుకు గబ్బు నేతలు జైలుకి వెళ్లారు  
 
గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం
యిది గడిచిన ఘనతకు సంకేతం
యిది మరచిన నడతకు  సంకేతం
 
రఘుపతి రాఘవ రాజారాం
ప్రతి నేతా పాప కూపమే సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబ్ నేతా కో సన్మది దే భగవాన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి