అద్భుతం జరుగుతుంది అన్నావు, ఓ సంగ్మా, ఓ సంగ్మా
అద్భుతాలు జరగవు, యిది ఓ నయా రాజ్యము తెలుసుకో
‘ప్రతిభ పాటల్’ పాడినా
“ప్రణభ నాదము” మ్రోగినా
ప్రదాన మంత్రిని ప్రతిమ లా చేసినా
ప్రతి చర్యకు వెనకా వున్నది ప్రముఖ హస్తమొక్కటే
ప్రతి చర్యకు ముందూ వున్నది ప్రముఖ హస్తమొక్కటే
ప్రజా స్వామ్యం ముసుగులో, ప్రతి నాయకుడూ......ప్రతినాయకుడై
ప్రజా సేవ ముసుగులో ప్రజలను వారి పాట్లకు వదిలేసిన కాలమిది
ప్రజాస్వామ్య ప్రహసనం యిది
ప్రజల ఓటుకు ప్రారబ్ధం యిది
ప్రజాస్వామ్యపు రంగులో ప్రముఖుల కుటుంబ పాలన యిది
ప్రజాస్వామ్యపు బొంకులో వ్యక్తి పూజకి భక్తులెక్కువైన కాలమిది
ప్రజాస్వామ్యం ముసుగులో తెల్ల చర్మానికి యింకా దాసోహమంటున్న
దేభ్యమిది
ప్రజాస్వామ్యం ముసుగులో కళ్ళు మూసుకుని, తెల్ల చర్మపు కాళ్ల
మీద పడే దేభ్యమిది
ప్రజాస్వామ్యమునుద్దరింప వచ్చుచున్నది రాహు కాలము
ప్రజాస్వామ్యమునుద్దరింప వచ్చుచున్నది ప్రియా అంకము
లాంగ్ లివ్ ది క్వీన్
లాంగ్ లివ్ ది ప్రిన్స్
లాంగ్ లివ్ ది ప్రిన్సెస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి