యముడు భూలోకంలో ఒక బ్రాంచ్ ఆఫీస్ కి అర్జీ పెడితే అర్జంట్ గా
ఆంద్ర
ప్రదేశ్ వేలం వేసి, లాటరీ లేసి మద్యం షాపులు పెట్టించింది
గుడి ఎదుట, బడి
పక్కన మద్యం షాపులు వెలిసాయి
యిళ్ళ ముందు,
హైవేలో మద్యం షాపులు వెలిసాయి
హైవేలో...రహదార్ల
మీద...
హైవేలో...రహదార్ల
మీద...
యమ భటులు మృత్యు
దేవత పూజార్ధం బ్రాందీ, విస్కీ తీర్ధములు అమ్ముతున్నారు
తప్ప తాగిన
మృత్యు వాహన చోదకులు, తప్పు చేయని ప్రయాణీకుల ప్రాణాలు బలి చేస్తున్నారు
మృత్యు దేవత మానవ
రక్త ధారలతో రహదార్ల మీద రక్తపు కళ్ళాపు జల్లుతోంది
మృత్యు దేవత రహదార్ల
ముంగిట, తెగిపడిన మానవ అవయాలతో ముగ్గులేస్తోంది
తాగుబోతు
భర్త తాళి కట్టిన భార్య తాళి బిగించి చంపేస్తున్నాడు
తాగుబోతు
కొడుకును ఒక కన్న తల్లి విసిగి, వేసారి చంపేసింది
తాగునీరు
అడిగితే, సాగు నీరు అడిగితే
తాగుబోతులను
తయారు చేస్తున్నారు
ఫ్లోరీను కలుషిత
నీరు తాగి కాళ్ళూ, చేతులూ. . . వెన్నూ, కన్నూ వంకర పొతే పట్టించుకోరు
ప్లీహములు పంక్చర్
అయ్యీ, కాలేయాలు కాలిపోతే...ఆరు నెలలకోసారి స్టేట్ మెంట్లు యిస్తారు
మద్య నిషేధం
కాని పనే...సరే...మరి
మద్య నియంత్రణ
కానిపని కాదుగా?
వీదికొక్క
నాయకుడు, నాయకురాలు రాకపొతే
వూర కుక్క
వలె మద్యం కాటేస్తుంది, కరిచేస్తుంది, చంపేస్తుంది
ప్రజా గళం పెగలాలి,
వినిపించాలి
మద్య గరళాన్ని
నియంత్రించాలి
ప్రజలలో చైతన్యం రానిదే ఎవరూ ఏమీ చెయ్యలేరు.....
రిప్లయితొలగించండిఆలోచించే వారు తాగరు.....
తాగే వారు ఆలోచించరు.....
జనం గతి ఇంతే......