15, జూన్ 2012, శుక్రవారం

కొన్నది వోటు కాదు ..అమ్మినది వోటు కాదు

రాక్షస రాజకీయ క్రీడారణ్యం లో క్రూర మృగాల వికృత కేకలు
దోపిడి సంపద పెట్టుబడి తో ప్రజాస్వామ్య పునాదులలో ప్రకంపనలు

ప్రజలిచ్చిన అధికారం..అహంకారమై...కోట్లు కూడేసి
వోటు పవిత్రత పాతాళంలో పాతేసిన నయ వంచకులు 

సెంటిమెంటు తో కుంటుతున్న ప్రజాస్వామ్యం

ఓటును అమ్మితే తప్పు లేదనే నూతన నీతిసూత్ర వికారం
కొన్నది వోటు కాదు ..అమ్మినది వోటు కాదు

అమ్మినది ఓటు కాదు..అమ్మినది.. భరత మాత భవితను
కొన్నది వోటు కాదు...కొన్నది ..భరత మాతకి వేయబోయే సంకెళ్ళను

అమ్మినది వోటు కాదు ...

విలువల్లేని రాజకీయ వ్యాపారంలో..వలువలూడిన భరత మాత మానమది
మానం లేని రాజకీయరణ్యంలో భరత మాత గుండెలో గుచ్చిన కత్తి అది

1 కామెంట్‌: