వుద్యమించు…
వుద్యమించు.
మద్యం వుప్పెన మీద... వుద్యమించు మద్యం కార్చిచ్చు మీద
సారా రక్కసి మీద
...వుద్యమించు వుద్యమించు
వుద్యమించు ..వుద్యమించు
కబళింఛి కాటు వేస్తూన్న మద్యం మీద
వుద్యమించు వుద్యమించు
నాలుగు పెగ్గులు వెయ్యక పొతే కాని నడవ లేని,
బస్సు నడపలేని డ్రైవర్ల మీద
ప్రజల జీవితాల మీద మద్యపు వేలం పాటలు పాడి,
లాటరీ లాడుతున్న ప్రభుత మీద
వుద్యమించు వుద్యమించు... వుద్యమించు
వుద్యమించు
మద్యం మహమ్మారి మీద ...త్రాగుడు త్రాచు పాము
మీద
శవాల మీద నాణేలు ఏరుకునే వాని కన్న దిగజారి
శవాల ఫాక్టరీలు వంటి మద్యపు దుకాణాల లైసన్సులు
జారీ చేస్తూ
మత్తు లో చిత్తయిన ప్రభుత మీద, మత్తు కి
వత్తాసు పలుకుతున్న నేతల మీద
వుద్యమించు వుద్యమించు... వుద్యమించు వుద్యమించు
ఎవరు రాక్షసులీ లోకంలో ?
ప్రజల కిడ్నీ లతో వ్యాపారం చేసే వారా ?
ప్రజల కిడ్నీలు పాడుచేస్తున్న ప్రభుత్వమా ?
కాలేయాల్ని కాల్చేస్తున్నారు
కాలేయాల్ని కాలరాస్తున్నారు
అమ్మ కి ద్రోహం చేస్తున్నారు
ఆలిని కష్టాల కడలి లో తోసేస్తున్నారు
నేరాల పంటకి సారా నారు పోస్తున్నారు
ఘోరాల మేడకి, మద్యపు పునాది
వేస్తున్నారు
వుద్యమించు…
వుద్యమించు.
మద్యం వుప్పెన మీద వుద్యమించు
సారా రక్కసి మీద వుద్యమించు
హైవే రహదార్ల లో బార్లు సాగనిచ్చే నికృష్టపు రావణ రాజ్యంలో
ప్రయాణీకుల రక్తపు ధారలతొ దాహం తీర్చుకునే
అసుర పాలనలో
అమ్మలారా ..నాన్నలార
అక్క లారా ..అన్నలారా
కదలి రండి ...కదలి రండి కదలి రండి ...కదలి రండి
కన్నబిడ్డల్ని కాపాడు కొనేందుకు ...కళ్ళు
మూసుకున్న కభోద నేతల కళ్ళు తెరిచేందుకు
కదలి రండి ...కదలి రండి కదలి రండి ...కదలి రండి
గాంధీ వాదం వదలి బ్రాందీ వాదం పట్టిన నవ
సమాజపు రీతి సవరించంగ
మందు మాఫియాల మాఫీ కోసం, బ్రతుకులు సాఫీ గా
సాగే రోజుల కోసం
కదలి రండి ...కదలి రండి కదలి రండి ...కదలి రండి
వుద్య మిద్దాం... వుద్య మిద్దాం...నడుం కట్టి
నడుద్దాం
కళ్ళ ముందు కార్చిచ్చు ...కళ్ళ ముందు కార్చిచ్చు ...
ప్రభుత్వానికి కనపడక పొతే
నేతలకు వినపడక పొతే
ప్రజలము మౌనం వీడక పొతే
మద్య పిశాచాలు ప్రజల్ని పిప్పి చేస్తాయ్
సారా దెయ్యాల దౌష్టీక రాజ్యం దద్దరిల్లుతుంది
మాఫియా రాక్షసులు రాజ్యమేల తారు
మధ్య
పానం ప్రాణాలు తీస్తోంటే
మద్యం తాగిన వారి పేగులు తెగుతుంటే
తాగిన వారు తాగని వారి జీవితాలతో ఆడుకుంటుంటే
తాళి బొట్లు తెగుతూంటే , ఆలి బ్రతుకు ఎగ తాళి అవుతోంటే
తాగి తాగి రాష్ట్రం కాష్టం అవుతోంటే, ఆ
సెగలలో వెచ్చదనాన్ని ప్రభుత్వం అశ్వాదిస్తోంటే

బుద్ధుడు ఎక్కడినించో దాలేదని ...గాంధీ వేరే
గ్రహం లో పుట్టలేదని తెలుసుగా
కష్ట మొచ్చినపుడు వచ్చే కన్నీళ్లు విధి మార్చలేవని తెలుసుగా
నీలో వుదయించాలి యింకో గాంధీ ...నీవే కావాలి
నేత ..మార్చాలి మన తల రాత
మధ్య
పానం ప్రాణాలు తీస్తోంటే
మద్యం తాగిన వారి పేగులు తెగుతుంటే
తాగిన వారు తాగని వారి జీవితాలతో ఆడుకుంటుంటే
తాళి బొట్లు తెగుతూంటే , ఆలి బ్రతుకు ఎగ తాళి అవుతోంటే
తాగి తాగి రాష్ట్రం కాష్టం అవుతోంటే, ఆ
వేడి సెగల వెచ్చదనాన్ని ప్రభుత్వం అశ్వాదిస్తోంటే
పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టి మద్య వ్యాపారులు సంతోషిస్తోంటే
చచ్చిపోయిన తాగుబోతు భర్తల చావులకి భార్యలు సంతోషిస్తోంటే
ఏమిటి నీ కర్తవ్యమ్ ? ఏమిటి నా కర్తవ్యమ్ ? ఏమిటి మన కర్తవ్యమ్ ?
మౌనంగానే వుందామా ? ప్రభుత్వం లానే మనమూ చోద్యం చూద్దామా ?
ఏమి చేద్దాం ? చద్దామా ? లేద్దామా ? ...లేద్దామా ? చద్దామా ?
ఎలుగెత్తి చాటుదామా? గొంతెత్తి చాటుదామా?

యిక చాలు ఈ క్రూరత్వమనీ , యిక చాలు ఈ పైశాచిక కృత్యాలని
యిక చాలు ఈ తాళి బొట్టులు తెంచే వ్యాపారమనీ
యిక చాలు ఈ తాళి బొట్టులు తెంచే వ్యాపారమనీ
ప్రజా శ్రేయస్సు వ్యతిరేక మద్య వ్యాపార నియంత్రణ కావాలి, రావాలి
సమాజ సౌభాగ్యం కోసం మధ్య విధానాలు మారాలి
ఆ మార్పు నీతో రావాలి, నాతొ రావాలి, మనతో రావాలి
సమాజ సౌభాగ్యం కోసం మధ్య విధానాలు మారాలి
ఆ మార్పు నీతో రావాలి, నాతొ రావాలి, మనతో రావాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి