10, జూన్ 2012, ఆదివారం

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరువద్దు

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరువద్దు
జాతిని పొడిచి, నీతిని మరచిన గజ దొంగలనే మరువద్దు

2G స్పెక్ట్రం విక్రయాల అక్రమాలు మరువద్దు
దోచి దాచిన సమగ్ర సంపద జాతి దని మరువద్దు

కామన్ వెల్త్ క్రీడల్లో కీడ పురుగుల కోట్ల గలాటా మరువద్దు
కామన్ మేన్ కష్టాల్లో, చీడ పురుగులు చట్ట సభల్లో చేరారని మరువద్దు

బ్రహ్మ రధం పట్టీ, కోట్లు కొల్లగొట్టీ , పుట్టిన బ్రహ్మాణీ స్టీలు ను మరువద్దు
జన్మ జన్మలకు పట్టనన్ని కోట్లూ,  ఖనిజాన్నీ, నిజాన్నీమింగిన ద్రోహులను మరువద్దు

విలువలు మరచి, మద్యం వేలం వేసి, కోట్లు మెక్కిన మత్తు, చెత్త పరిపాలన మరువద్దు
విలువలు మరచి దుష్టుల గెలిపించి జాతికి, నీతికి, ద్రోహం చెయ్యొద్దు

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరువద్దు
జాతిని పొడిచి, నీతిని మరచిన గజ దొంగలనే మరువద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి