గరం ...గరం...గరం ...గరం...
రాష్ట్రమంతా గరం ...గరం...
ఎండా కాలం మంట ఒక వైపు
ఎలక్షన్ల తంటా ఒక వైపు
మండుటెండ ఒక వైపు
గుండె మంట ఒక వైపు
ఎమ్మెల్యేల రాజీ నామాలు ఒక వైపు
ఓటరన్న గుండె మంట ఒక వైపు
అయిదేళ్ళు ఎమ్మెల్యేగ వుండగ లేని నాయకులొక వైపు
అయిదు వేళ్ళు నోటిలోకి పెట్ట..కూడు లేని బ్రతుకులొక వైపు
రాష్ట్రమంతా గరం ...గరం...
ఎండా కాలం మంట ఒక వైపు
ఎలక్షన్ల తంటా ఒక వైపు
మండుటెండ ఒక వైపు
గుండె మంట ఒక వైపు
ఎమ్మెల్యేల రాజీ నామాలు ఒక వైపు
ఓటరన్న గుండె మంట ఒక వైపు
అయిదేళ్ళు ఎమ్మెల్యేగ వుండగ లేని నాయకులొక వైపు
అయిదు వేళ్ళు నోటిలోకి పెట్ట..కూడు లేని బ్రతుకులొక వైపు
హక్కు.. రాజీనామాలు మా హక్కు.. అనే నేతలోక వైపు
కక్కు పౌరుడా పన్నులు కక్కు అనే ప్రభుత ఒక వైపు
శాసన
సభలో ధర్నాలూ, వాకౌట్లూ , కొట్లాటలూ,
తిట్లూ...ఒక వైపు
శాపమిది మాపాలిట…పాపమిది మా పాపిట… అనుకొనే జనం ఒక వైపు
శాపమిది మాపాలిట…పాపమిది మా పాపిట… అనుకొనే జనం ఒక వైపు
ధరిత్రిలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమన్న ఘన
కీర్తి ఒక వైపు
చరిత్రలోనే అతి పెద్ద స్కాములున్న మన కీర్తి ఒక వైపు
చరిత్రలోనే అతి పెద్ద స్కాములున్న మన కీర్తి ఒక వైపు
ఆరు నెలలకొక సారి వచ్చే మార్చ్...సెప్టెంబర్
పరీక్షల్లా ఎన్నిలొక వైపు
ఆరి పోతున్న గొంతుల ..మాడిపోతున్న బ్రతుకుల భాగోతం ఒక వైపు
ఆరి పోతున్న గొంతుల ..మాడిపోతున్న బ్రతుకుల భాగోతం ఒక వైపు
కరంట్ లేక అగ చాట్లొక వైపు
పదవి కొరకు సిగపట్లొక వైపు
పార్టీల పాకెట్లో పత్రికలూ , చానెళ్ళూ ఒక వైపు
కోర్టులతో..కొవర్టులతో పార్టీల పాట్లొక వైపు
ఎలక్షన్ల సమరం ఒక వైపు
కలక్షన్ల సంబరం ఒక వైపు
ఎన్నికల హవా ఒక వైపు
కన్నకలల హారతి ఒక వైపు
ఎన్నికల మద్యలో మద్యం పొంగు లొక వైపు
తన్నుకొనే ఎలక్షన్లలో సార్ లు పోసే సారా ఒక వైపు
గనులు, జనుల లూటీ ఒక వైపు
సెజ్ లు, సెలయేర్ల లూటీ ఒక వైపు
‘ప్రజల రాజ్యం’… హస్త గతం ఒక వైపు
జనుల భావాలు సమస్త ఖననం ఒక వైపు
తమ్ముళ్ళూ, బావలూ... బామ్మర్దులూ, అసమర్ధులూ ఒక వైపు
భార్యలూ, బాబాయ్ లూ, అమ్మలూ... అమ్మోర్లూ ఒక వైపు
బిక్కు బిక్కు మని..ఎన్నికల సమరంలో
చిక్కుకొని,
చిక్కి పోయి , చితికి పోయిన ఓటరు ఒక వైపు
చిక్కి పోయి , చితికి పోయిన ఓటరు ఒక వైపు
ఓటరు ఓటమి ఒక వైపు... నాయకుల గెలుపు ఒక వైపు
ఓటరు ఓరిమి ఒక వైపు... భాదల బ్రతులొక వైపు
స్వాతంత్ర సమర యోధులు జైలు కెళ్ళిన చరిత ఒక
వైపు
కుతంత్ర కుటిల నాయకులు జైలు కెళ్ళిన నడత ఒక వైపు
గరం ...గరం...గరం ...గరం...
రాష్ట్రమంతా గరం ...గరం...
కుతంత్ర కుటిల నాయకులు జైలు కెళ్ళిన నడత ఒక వైపు
గరం ...గరం...గరం ...గరం...
రాష్ట్రమంతా గరం ...గరం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి