ఇండియా 'హస్త'గతం ఇండియా అస్తవ్యస్తం
ఇండియా హస్తం పార్టీగతం ఆ పార్టీ ఇటాలియన్ సొంతం
వంద కోట్ల భారతీయుల వందనాలు ఈ ఇటాలియన్ బొమ్మ కి
వందల కోట్ల హారతుల చందాలు ఈ ఇటాలియన్ బామ్మకి
మన్మోహన్ సింఘం ఓ సిల్లీ పిల్లి ఈ ఇటాలియన్ కి
జగన్మోహన సుందర దృశ్యమా? ఇది ఈ స్వతంత్ర రాజ్యానికి ?
రాహు(ల్) కాలం కోసం కుహనా నాయకుల తపస్సులు
రాహువే జీవం రాహువే ప్రాణం ఈ లజ్జ లెస్స జీవులకు
రాహువే ప్రధానం, రాహువే ప్రధాని,
రాహువే ప్రదాత , రాహువే విధాత
వద్దులే ప్రగతి .. ఇదే మన విధి రాత
రాహువు ని ప్రధాని గా చేయటమే, చూడటమే వారి కర్తవ్యమట
ఆశువు గా చెప్పాడీ మాట చిరంజీవి అనబడే చిరుజీవి ఈ మద్య
గాంధీ పేరు పెట్టుకుని హస్తిన చూరు పట్టుకుని రాజ్యం వెలగ బెడుతున్నారు
గాంధీ నామం పెట్టుకుని ప్రజానీకానికి పంగ నామాలు సరిగా పెడుతున్నారు
గాంధి పుట్టిన దేశమే ఇది... నెహ్రూ
బంధువుల రాజ్యమే ఇది
తరాలు మారినా తారలు ఆధునిక గాంధీలే
వరాలు, వారసత్వ సంపదలు వీరికేలే
ఈ కుళ్ళు కడిగే నాయకుడే లేడా
ఈ మొసళ్ళ నుండి హస్తినను కాపాడే వాడు రాడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి