8, సెప్టెంబర్ 2011, గురువారం

మద్యం ఉద్యమం మద్య మనం

వీధికి నాలుగు బార్లు, ఇంకో నాలుగు వైన్ షాపులతో అలరారుతున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను చూసి ..ఈ పేరడీ....
'సిపాయి చిన్నయ' సినీమా లో ఈ పాట రచయతకు క్షమాపణలతో .....
Original పాట
--------
నా జన్మ భూమి ఎంత అందమైన దేశం నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామీ రంగ హాయ్ హాయ్ నా సామి రంగ

నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలూ ...
పచ్చనీ పంటలూ .....వెచ్చనీజంటలూ ...చల్లనీ జీవితం ....ఇదే నవ భారతం
బ్రతకాలందరూ దేశం కోసమే... దేశమంటేనే మట్టి కాదోయ్ మనుషులే
స్వార్త్దమూ వంచన లేనిదే పుణ్యమూ త్యాగమూ రాగమూ మిళితమే
ధన్యమూ
-----------------------------
పారడి

నా జన్మ భూమి ఎంత అందమైన దేశమూ
మన వూళ్ళు 'మందు'లోనే ఘుమ్మనే ప్రదేశమూ

నా సామీ రంగ హాయ్ హాయ్ నా సామి రంగ


నడిచే దారిలో పిలిచే బారులూ ...బ్రాంది వాసనలతో... పెరిగే గుట్టలూ
పచ్చనీ బ్రతుకులూ ...కాల్చేనీ లిక్కరూ ...చలించదీ జనం ..ఇదే నవ భారతం
త్రాగాలందరూ దేశం కోసమే... దేశమంటేనే మట్టి కాదోయ్ మత్తులే
స్వార్త్దమూ.. వంచనా.. లేనిదే జరగదూ ... తాగారా...బాగుగా.. జీవితమే మద్యమూ

నా జన్మ భూమి ఎంత అందమైన దేశమూ
మన వూళ్ళు 'మందు'లోనే ఘుమ్మనే ప్రదేశమూ

నా సామీ రంగ హాయ్ హాయ్ నా సామి రంగ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి