5, మార్చి 2011, శనివారం

మార్చి 4, 2011: విశాఖపట్నం లో కొడవలి కత్తి పోటుకి బలిఅయి అసువులు బాసిన కృష్ణ వేణి కి నా అసృతర్పణాలతో

మార్చి 4, 2011: విశాఖపట్నం లో కొడవలి కత్తి పోటుకి బలిఅయి అసువులు బాసిన కృష్ణ వేణి కి నా అసృతర్పణాలతో

చట్టం తన పని తను చేసుకు పోతూంది..ప్రవచిస్తారు మంత్రులు
చట్టం ఎదుటే క్రిమినల్సూ కూడా వాళ్ళ పని వారు చేసుకు పోతున్నారు

ఎక్కడ నారి పూజింప బడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారట
ఇక్కడ నారి నరక బడుతుంటే ఇక్కడ చట్టం చుట్టం చూపు చూస్తోంది

సినిమాల్లో స్త్రీ అంగాంగం ప్రదర్శింప బడంగ
మద్యం ఏరులై, గంగలై, సంద్రాలై పొంగంగ.. పారంగ
మదం పోట్లెత్తదా మనిషిలో.. అసురుడు ఉదయించడా
మానవత్వం వుడాయించదా మహిలో సుమతీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి