25, డిసెంబర్ 2015, శుక్రవారం

సభాపర్వం లో ఓ సైకో, ఓ లుచ్చా, ఓ సొల్లు, ఓ కుక్క, ఓ సన్నాసి



ఎవరు సైకో ? సైకో ఎవరు ?
ఓటేసి ఓడిపోయిన వోటరు సైకోనా?
ఎవరు సైకో ? సైకో ఎవరు ?

ఎవరు లుచ్చా ? లుచ్చా ఎవరు? 
ఉచ్ఛస్థితి కలగన్న వోటరు లుచ్చానా ?
ఎవరు లుచ్చా ? లుచ్చా ఎవరు?

ఎవరు సైకో ? ఎవరు లుచ్చా ?

సొల్లుగాడెవాడు? ఎవడు సొల్లు గాడు ?
సొమ్మసిల్లి ఓటేసిన వోటరు సొల్లుగాడా ?
సొమ్ముకోసం ఓటమ్మిన వోటరు సొల్లుగాడా ?
సొల్లుగాడెవాడు? ఎవడు సొల్లు గాడు ?

ఎవరు సైకో ? ఎవరు లుచ్చా ? ఎవడు సొల్లు ?

కుక్కలా మొరిగేవాడెవ్వడు?
బిక్కచచ్చిన ఓటరు కుక్కా?
కుక్కలా పడివుండే ఓటరు కుక్కా ?
కుక్కలా మొరిగేవాడెవ్వడు?

ఎవరు సైకో ? ఎవరు లుచ్చా ? ఎవడు సొల్లు ? ఎవడు కుక్క ?

సన్నాసులెవ్వరు ? ఎవరు సన్నాసులు ?
కన్నులతో సభాపర్వాన్ని చూడలేని ఓటరా ?
ఖిన్నుడై, కన్నకలలు చెదిరిన ఓటరా ?
సన్నాసులెవ్వరు ? ఎవరు సన్నాసులు ?


ఎవరు సైకో ? ఎవరు లుచ్చా ? ఎవడు సొల్లు ? ఎవడు కుక్క ? ఎవడు సన్నాసి ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి