19, సెప్టెంబర్ 2015, శనివారం

నదుల అనుసంధానమా? అబద్ధాల అవధానమా ?- తెలుగు ప్రజల చెవుల్లో కేబేజీలు








ఎత్తిపోతల ప్రాజెక్టును, తెలుగు న్యూస్ మీడియా, ‘నదుల అనుసంధానమని’ ప్రచారం చేయటం చూస్తే, తెలుగు న్యూస్ మీడియాది తెలివి తక్కువ తనమో లేక అధిక తెలివో అర్ధం కావట్లేదు.
నదుల అనుసంధానము జరిపితే ఒక నదిలో నీరు ఎక్కువయినపుడు వేరే నదిలోకి ఆ నీరు సహజంగా ప్రవహించాలి, ఎటువంటి పంపులు మోటార్ల పనిలేకుండా . తద్వారా వరదల ప్రమాదాలు తగ్గే అవకాశము వుంటుంది, వేరే ప్రాంతాలకి నీటి సదుపాయం వస్తుంది.


యిపుడు జరిగిన ప్రాజెక్టు పంపింగ్ ద్వారా మాత్రమే నీటిని పంపగలదు. పంపు పనిచేక పోయినా కరెంటు లేక పోయినా నీరు దానికదే ఏమీ క్రిష్ణలోకి వెళ్లి పడిపోదు. దాన్ని నదుల అనుసంధానం అనటము వట్టి మూర్ఖత్వం లేదా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం .ప్రజల చెవుల్లో కేబేజీలు పెట్టటం సరికాదు.

2 కామెంట్‌లు:


  1. ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి తెలుగు పత్రికలన్నీ తెలుగుదేశం పార్టీ అనుకూలమే కదా.ఇంకేమని రాస్తారు?పోలవరం ప్రాజెక్టు కట్టలేక యీ మాటలన్నీ. పోనీలెండి.వాళ్లకి కావలసింది క్రిష్ణా డెల్టా. రాయలసీమ ఏమైతేనేమి .

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడు గోదావరికి వరదొచ్చి మట్టం బాగా పెరిగిందని అంటున్నారు గాని ఈ పెరిగిందానిలో ఇంత మొత్తం కృష్ణాకి వెళ్తుందని ఎవరూ చెప్పడం లేదు. అంటే ఈ అదనపు వరద నీరంతా సాయంకాలం సాగరతీరమేనా? అదే అయితే ఈ పంపులూ నిద్రాహారాలు మాని శ్రమించడాలూ స్వీయ స్తోత్రాలూ కోట్లు పోసి కొన్న కాలక్షేపం బఠానీలే.

    రిప్లయితొలగించండి