అయిదు కోట్ల ఆంధ్రుల కోసం
అసువులే యిచ్చేశాడు...
వాఘ్దానం మరచిన వారికి
దగ్ధం మయ్యి గుర్తు
చేసాడు
ముని కోటి బలి అయ్యాడు..
మౌన బాట వీడుతారేమోనని..
కన్నీట కుంగినే ఆంధ్రమాత
కనిపించదా కుటిల బుద్ధులార
యిచ్చిన మాటకి విలువల్లేవా ?
యిచ్చిన వోట్లకి వెలయే లేదా ?
సోనియా అడ్డంగా కుత్తుక కత్తిరించింది
అపుడు
వెంకయ్య నిర్దయగా చెడుగుడు
ఆడుతున్నాడిపుడు
మిత్ర వ్రతం లో మునిగున్న చంద్రుడు
మౌనవ్రతం పరమ నిష్ఠగా చేస్తున్నాడు
లక్ష కోట్ల అప్పుల నావలో ఆంధ్రుల పయనం
లక్ష్యాలేమో జపాన్లు, సింగినాదం సింగపూర్లు
పరిశ్రమ చేద్దామంటే పరిశ్రమలు పెట్టే
వారు లేరు
పరమాన్నం వచ్చేస్తుందని ప్రలోభాలు
పెడతారు
తినటానికి తిండి లేక పోయినా పరవాలే
పరిపాలనకో అమరావతి మాత్రం కావాలి
పార్ట్ టైం రాజకీయ పవనుని కాళ్ళమీద
జనం మొక్కులు
హర్ట్ అయిన ఆంధ్ర జనం బిక్కగా చూస్తోంది
దిక్కులు
పారిశుద్ధ్యపు
అడ్వర్టయిజుమెంట్లతో
పాడయిపోయినాయ్ రహదార్లు
సిటీల్లో మన పారిశుధ్యపు
రాంకు రెండొందల పైన
యిటువంటి చోటకి
వ్యాపారానికి వస్తాడా ఎవడైన ?
స్వచ్చ భారతమెటూ లేదు..
రాదు
స్వచ్చ వాయువు కూడా కరువే
పండగొస్తే పదుల సంఖ్యలో
పాదాల కింద జనం మరణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి