11, జులై 2015, శనివారం

స్వచ్చ భారత మెటుల వచ్చు? పస్తులుండు మా కడుపు నుండి ?






కనీస వేతనమడిగితే..కనికరము లేని దొరల్లార!    
కానరాద మా కష్టం ? కళ్ళు లేని కభోధులారా!

దుమ్ము ధూళి రోజు పీల్చి..మా శ్వాస కోశ త్యాగం చేసి
మిమ్ము మేము ప్రతిరోజు బిడ్డ లాగ చూసు కొంటె

మా కష్టం కానరాద? మా బ్రతుకులు భ్రష్టు పోవ !
మా రక్తం పణం బెట్టి, వూరి చెత్తనంత ఎత్తిపోస్తే   

కనీస వేతనమడిగితే..కనికరము లేని దొరల్లార!    
కానరాద మా కష్టం ? కళ్ళు లేని కభోధులారా!

ముక్కు మూస్కు మీరు పోతరు...వాసనలే పీల్చలేక
మాస్కు కూడా లేక మేము అందులోనే పనిజేస్తం

ఒళ్ళంతా గుల్ల చేసి... అశుద్ధమంత ఎత్తిపోసి  
వూళ్ళన్నీ వూడ్చి పెడతం..మీ ఒళ్ళు చక్కగుండ  
  
స్వచ్చ భారత మెటుల వచ్చు
పస్తులుండు మా కడుపు నుండి ?

వైద్యులకు ఎంతయినా డబ్బు పోయ వెనకాడరు!
వ్యాధులేమి మీకు రాకుండ  వీధులన్ని వూడ్చినోళ్ళు
కనీస వేతనమడిగితే..కనికరము లేని దొరల్లార!    
కానరాద మా కష్టం ? కళ్ళు లేని కభోధులారా!

కుళ్ళు లోన వళ్ళు బెట్టి...వళ్లంతా కుళ్ళ పొడుచి
ఏళ్ల తరబడి జీవితాలు వెళ్ళ దీసుకొన్న మేము  
కనీస వేతనమడిగితే..కనికరము లేని దొరల్లార!    

కానరాద మా కష్టం ? కళ్ళు లేని కభోధులారా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి