7, ఆగస్టు 2014, గురువారం

కల్తీ... కల్తీ... కల్తీ కుళ్ళిన కోడి... చికెన్ పకోడీ



కుళ్ళిన కోడి... చికెన్ పకోడీ
కల్తీ విత్తనం...రైతుకి తద్దినం
కల్తీ మద్యం ...కాటికి త్వరగా పయనం
నకిలీ మందులు...చావుకి తత్కాల్ టిక్కెట్లు
నార్త్ హీరోయిన్ల నిక్కర్లు... నశించి పోయిన తెలుగు హీరోయిన్లు
హీరో కొడుకు!... వాడే హీరో!
నిర్మాత కొడుకు!...వాడూ హీరో!
ఛాయిస్ లేని సినీ అంగడ్లు...కొడుకుల హీరో ఖార్ఖానాల ఆగడాలు!   
వాయిస్ లేని వాజమ్మలు... విలువైన మన్మధులు!
ముద్ద మాటల మొద్దులు... ముద్దుల మనవళ్ళు! 
వోదార్పు యాత్రలు...వోట్ల యంత్రాలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి