13, డిసెంబర్ 2013, శుక్రవారం

ఎడారిలో ఎండమావులే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు


అమెరికాకే అందమయ్యె మన తెలుగు పడుచు నీనా 
మరిమన తెలుగు సినిమాన తెలుగు పడుచు నో..నో

తెల్లజాతి వివక్షను తెల్లార్చిన మండేలాను పొగుడుతాం   
కల్లబొల్లి చెప్పుతాం, ముంబాయ్ తెల్ల హీరోయిన్లకి పడిపోతాం    

ముంబాయి తెలుపు చర్మంకి పచ్చిగా టాలీవుడ్ టాం..టాం..లు
ముందరున్న బాపు బొమ్మలపోలు తెలుగు పడుచులకి టాటాలు

ఎడారిలో ఎండమావులే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు
లొడాయి హీరోగాళ్ళకు ఉత్తరాది ఆడే బొమ్మలే ఆభరణాలు  

కంటికింపయిన తెలుగు వనితలు వెండితెర మీన కానగరారు! ఎందుకో ?  
యింటి యిల్లాలును వదిలి వీధిలోన బొమ్మలు పట్టు చందము, ఎందుకో ?

సావిత్రి మరల పుట్టినా తెలుగు సినిమాలో ఆమెకి అవకాశం రాదు
ధరిత్రి మొత్తానికి యింత గొప్పతనం ఏ జాతి లోనూ కనిపించదు

తెల్ల వనితను దేశానికే నేతను చేయ, తయారు మన బుద్ధి
తల్లి దేశానికే తప్పలేదు! టాలీవుడ్ కెక్కడ అంతకన్న శుద్ధి      

తెలుగమ్మల పుత్రులు తరం తరం ప్రతి తరం తెర వేలుపులు కాగా   
తెలుగమ్మాయిలను తరిమి తరిమి కనుమరుగు, తెరమరుగు చేసారేం?
 
వచ్చేస్తారు హన్సిక, కాజోల్, తాప్సి, తమన్నా... కాదన్నా
బచ్చన్లు, కపూర్లు, ఖాన్లు రారేం? వారేమి తప్పు చేశారన్నా?   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి