10, డిసెంబర్ 2013, మంగళవారం

కాంగిరేసు రహిత దశ దేశమున ఆశన్నమాయె


ఆఫ్రికాలో తెల్లదనం తల్లక్రిందులయ్యె
నల్లనయ్య మండేలా అధినేత అయ్యె

అమెరికా నల్లవానికి అధికారమిచ్చె  
మెరిక బరక్ ఒబామా అధ్యక్షుడాయె

కాంగిరేసు మాత్రమింకను తెల్లతొక్కకు దాస్యమాయె
వందయేండ్ల పార్టీకి ఒక్కడైనను భరత బిడ్డ దొరకపోయె  

వంశపాలనలో వంశాంకురాల చూసి మురిసిపోయె
గాంధీ కాని గాంధీల పాదాభిషేకంలో పరవశించిపోయె

పది జనపథమ్మున పడిగాపులు కాచె
అదియే స్వర్గథామము, సర్వమని తలచె

తలపండిన మోడితోన తలపడి తల్లడిల్లె
అరవిందాస్త్రమున హస్తము అస్తమించె

యువరాజు అహం దహనమయ్యె
భట్రాజులు, భజంత్రీలు మూగాపోయె

కాంగిరేసు రహిత దశ దేశమున ఆశన్నమాయె

భంగపడిన నేతలింకనైనను మూఢభక్తి విడుతురా?  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి