10, ఆగస్టు 2013, శనివారం

సరదా సరదా సిగరెట్టూ...(యిపుడు: సరదా సరదా పెగ్ కొట్టు) –కొసరాజు గారి పాట



సరదా సరదా సిగరెట్టూ
భలె దొరల్తాగు ఈ సిగరెట్టు 

రాముడు భీముడు సినిమాలో కొసరాజు ఈ పాట లో , సున్నితంగా పొగ తాగు దురలవాటు గురించి వ్రాశారు.

ఈ పాట YouTube లింక్ :

ఈ రోజుల్లో పొగ తాగటం కన్నా మందు కొట్టటం బాగా ఎక్కువయింది.


కొసరాజు గారు మద్యపాన దురలవాటు గురిచి పాట వ్రాస్తే యిలా వుంటుందేమో... 
*  *  *  *
(నలుపు అక్షరాలు : రేలంగిఎరుపు అక్షరాలు : గిరిజ)

సరదా  సరదా పెగ్గోయి  
భలే పసందయిన భలె పెగ్గోయి  
సరదా  సరదా పెగ్గోయి  
భలే పసందయిన భలె పెగ్గోయి   
పట్టు పట్టి ఒక పెగ్గు పీకితె
స్వర్గానికె యిది తొలిమెట్టు
సరదా  సరదా పెగ్గోయి  
భలే పసందయిన భలె పెగ్గోయి  

విషం విషం ఈ మందొద్దూ
యిది తాగ కోయి నా పై ఒట్టు
విషం విషం ఈ మందొద్దూ
యిది తాగ కోయి నా పై ఒట్టు
లివర్ మండునూ ఆల్సరొచ్చునూ
వదిలి పెట్టవోయి ఈ మందూ
విషం విషం ఈ మందొద్దూ
యిది తాగ కోయి నా పై ఒట్టు

ఈ పెగ్గే కొట్టి ఎంతో మంది
గొప్ప గొప్ప వాళ్లయ్యారూ
హా...ఎవడో కోతలు కోసాడూ
ఈ పెగ్గేస్తే గొప్ప గొప్పగా  
రిలాక్స్ కావచ్చూ
ప్రాణాన్ని తీసేస్కోవచ్చూ   
సరదా  సరదా పెగ్గోయి  
భలే పసందయిన భలె పెగ్గోయి   


లివర్ పేగుల్లో కాన్సర్ కిదియే
కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
కొవ్వు పేరుకొని విషము చేరుకొని
ఉసురుదీయు పోమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ
హ విషం విషం ఈ మందొద్దూ
యిది తాగ కోయి నా పై ఒట్టు

సమాజమ్ములో స్టేటస్
పెంచునీ మందు భలె మందు
వాహ్ ...నీవెరుగవు దీని పవరూ
అబ్బో...గుజరాతులో తాగటమే
నిషేదించినారందుకే...
సరదాయే వాళ్లకి లేదందుకే...
సరదా  సరదా పెగ్గోయి  
భలే పసందయిన భలె పెగ్గోయి  
హ విషం విషం ఈ మందొద్దూ
యిది తాగ కోయి నా పై ఒట్టు

ధైర్యానికి ఈ మందు కొట్టూ
భలే భలే ఈ పెగ్ కొట్టు
పైత్యానికే ఈ పెగ్ కొట్టూ
బడాయి కిందా జమకట్టూ
ఆనందానికి పెగ్ కొట్టు
ఆలోచనలని గిలగొట్టూ
వాహ్..పనిలేకుంటే  పెగ్ కొట్టు
తాగుతూ వుంటె ప్రాణం పోతుందీ
మత్తు మత్తు యిచ్చె ఈ పెగ్గూ
భలే సరదా యిచ్చు ఈ పెగ్గు
కొంప కాల్చునీ పెగ్గు
దీని గొప్ప చెప్ప చీదర బుట్టు

సరదా  సరదా పెగ్గోయి  
భలే పసందయిన భలె పెగ్గోయి  
విషం విషం ఈ మందొద్దూ
యిది తాగ కోయి నా పై ఒట్టు

      


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి