18, జనవరి 2013, శుక్రవారం

బిలియను భారతీయులందు ఒక్క నాయకుడు దొరకడయ్యె కాంగ్రేసుకు




బిలియను భారతీయులందు ఒక్క నాయకుడు దొరకడయ్యె కాంగ్రేసుకు 
బలిచేసితిరే భారత గౌరవమ్మును, సోనియా మయీనో పాదముల చెంత 
బలము గల్గిన రాజుల మద్య సఖ్యము లేక, ఆనాడు తెల్లదొరలకిటులె 
బేలగ భరత దేశమును బలిచేసితిరి, నేడుకూడ మీ మతులంతయే గదా

గాంధి పేరు పెట్టుకున్ననంతనే త్యాగబుద్ధి వచ్చునే 
గంధము పూసినంతనె ఎయ్యది కొయ్య గంధపు చెక్కగు ?
గాంధారి సంతానమెల్ల హస్తినాపురినాక్రమించె నేడుకూడ, ఈ 
గందగీనెల్ల వూడ్చిపెట్టు నిజ స్వరాజ్యమెపుడు వచ్చునో !

రాచరికపు మరకలెల్ల నిండిపోయె నేటి రాజకీయముల 
రాచపుండు ఓలె ఈ రాకుమార కురుపులేమి ? ఏడ 
రచియించిరి రాజ్యాంగమున ఈ వారసత్వ చీడ గూర్చి?
రుచియించదు ఈ రీతి, ఎవ్వరికిను, భావి భారతమునకు 

పెక్కు చదువులు చదివి, పెక్కు వత్సరములు నలిగి గాని ఏ 
ఒక్క సంస్టకు ప్రధాన అధికారి కానేరరు, మరి యిది ఏమి చిత్రమొ 
ఒక్క మాటున రాహుడెట్లు ప్రధానమంత్రిత్వముకై ఎసరు పెట్టె 
బక్క చిక్కి, కుక్క చావు చచ్చుచున్నదీ ప్రజాస్వామ్యము గదా

1 కామెంట్‌:

  1. aahaa.....abhinandanalu sodaraa....akshara satyam .aani muthyallanti matalu/padyalu.
    manam ila matladuthuune vuntam. mana prajaswamyam congress style lo vardhilluthuu vuntundi.
    that is india......mera bharath mahaaaaaaaan

    రిప్లయితొలగించండి