5, ఏప్రిల్ 2012, గురువారం

సినిమా టైటిళ్ళ దౌర్భాగ్యం :'నిర్మలా ఆంటీ' టైటిల్ - ఈ నిర్మాత కు నిర్మల అనే కూతురు వుంటే?





కాసులు సంపాదించే ఆశకు నీతి, నియమం, పరాయి వారి మనోభావాలు ఏమీ అక్కర లేదు.
నీతి చెబుతున్నాము అనే బూటకపు నెపం తో సెక్స్ చూపించి డబ్బులు సంపాదిద్దాము అని ఈ
సినిమా నిర్మాత 'నిర్మలా ఆంటీ' అని పేరు పెట్టాడు, ప్రపంచంలో యిక ఏ పేరూ లేనట్టు.

ఎవరైనా ఈ సినిమా  టైటిల్ ని నిరసిస్తూ , PIL వేస్తె నేను సమర్ధిస్తా. (నేను వున్న ప్రదేశం దృష్ట్యా నాకు
ఇది వీలు పడదు). యిటువంటి సినిమాలను భహిష్కరిస్తే సదరు నిర్మాతలకు కొంచమయినా బుద్ధి వస్తుంది.


నిర్మల అన్న పేరు దేవుని పేరు కాకపోయినా ఎంతో వాడుక లో వున్నపేరు,
ఎంతో మంది అక్క, అమ్మ, చెల్లిళ్ళ పేరు. ఈ పేరు తో అసభ్యమైన సినీమా తీసి, అసభ్యమైన  పోస్టర్లు
పెట్టి ఎంతో మందిని మానసికంగా బాధ పెట్టి, అగౌరవ పరిచి తన పబ్బం గడుపు కుంటున్నాడు ఈ నిర్మాత.


ఈ ప్రక్కన వున్న వోటింగ్ ద్వారా ఈ అసభ్య సినీమా టైటిల్ పై మీ అభిప్రాయాని తెలియ చేయ మనవి.

3 కామెంట్‌లు:

  1. మనము చాలా వాటికి బండ బారిపోయాము. ఇది అలాంటివాటిలో ఒకటి. మనోభావాలు కాదు మనుషులు దెబ్బ తిన్నా సరే, మూర్ఖులు మారరు. మన ఖర్మ మారదు. నేను మిమ్మల్ని పూర్తిగా సమర్థిస్తాను.

    సీతారామం

    రిప్లయితొలగించండి
  2. సార్..మరి మీరు ఈ సినిమా తీసి ఉంటే ఏమి పేరు పెట్టి ఉండే వాళ్ళు?????????

    రిప్లయితొలగించండి