7, ఏప్రిల్ 2012, శనివారం

యిది మద మత్సరం...కేవలం బొత్స తరం


యిది మద మత్సరం...కేవలం బొత్స తరం
యిది అవినీతి తరంగం..అవినీతి చదరంగం

లిక్కర్ మాఫియా
చక్కర్ చలాయా 

ఎగరేసింది ఈ ప్రభుత అవినీతి జయ కేతనం !
తగిలేసింది.. దక్షత వున్నఅధికారిని..ఏమి పతనం!  

మందు బాసుల ఫైళ్ళు మూసి వేయగ
మందు కేసుల ఫైళ్ళు మూగ పోవగ

బిక్కచచ్చి పోయే నేడు అవినీతి నిరోధాదికారము
చిక్కి పలచనాయే నీతి బలము, ప్రజల బలము   

యిది మద మత్సరం...కేవలం బొత్స తరం
యిది అవినీతి తరంగం..అవినీతి చదరంగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి