న్యాయ వాదుల దాడి
లో గాయపడిన కానిస్టేబులు మృతి- Bengaluru, Dt.02-Mar-2012
న్యాయ స్థానం ముంగిట భారత మాత ముద్దు బిడ్డల వీధి పోరాటం
(అ)న్యాయ వాదుల, రక్షక భటుల, పాత్రికేయుల ప్రత్యక్ష నిజ విశ్వ స్వరూపం
అశువులు బాసెను పోలీసు మహాదేవయ్య, గనుల ఘనులు లేపిన 'గాలి' దుమారపు దాడి న
అశ్రుధారలు పారెను న్యాయ దేవత కంట, కానగ రావు అవి తన కను గంతల మాటున
నిజ ఖనిజ గజ దోపిడీ దారుల తంత్ర కుతంత్ర యాత్రల్లో
సగటు జీవుల పాట్లు, అగచాట్లూ, కత్తి పోట్లు, తుపాకీ తూట్లు
న్యాయ వాదమాయె తీవ్ర వాదము
న్యాయ పీఠ మాయె బలి పీఠం
రాతి యుగపు వాద మెంచె న్యాయ వాదము
రాళ్ల వాన చేసి.. పోలీసు అసువు తీసె.. ఎంత ఖేదము!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి