20, మార్చి 2012, మంగళవారం

యింకెన్ని చిన్నారుల ప్రాణాలు అర్పితము కావాలి ఈ సారా యజ్ఞం లో ?

మత్తు నిండిన మధ్యాంధ్ర ప్రదేశ్ లో మృత్యు ఘోష
చిన్నారుల నెత్తురు త్రాగుతున్న త్రాగు బోతులు

సారా రాక్షసి విలయ తాండవము చేస్తున్నా
అసెంబ్లీ లో ప్రజల్ని పట్టించుకోని నాయక గ్రహాలూ
ప్రతి రోజు ఎలక్షన్లు, రాజీనామాలు..ఎలక్షన్లు..మళ్ళీ రాజీనామాలు

ఒక పక్క త్రాగు నీరు లేక చస్తున్న జనం
ఒక పక్క వాగు నీరులో పడిన చిన్నారుల మరణం

వీధికో బ్రాందీ షాపు, నిశీధిలో మధ్యాంధ్ర ప్రదేశ్
వీధికో సారా షాపు, విధులు మరచిన ప్రభుత్వాలు

సార వంతమయిన రాష్ట్రంలో సారా వ్యాది వ్యాపకం
సార్ లకు పట్టదు...సారా రాక్షసి వికృతం

వూరుకొక్క నాయకుడు లేని దౌర్భాగ్యం
వూర కుక్కలా కాటేస్తున్ననాటు సారా

యింకెన్ని చిన్నారుల ప్రాణాలు అర్పితము కావాలి ఈ సారా యజ్ఞం లో ?
యింకెన్ని చితులు కాలాలి ఈ సారా కాష్టంలో ?
యింకెన్ని సతుల బ్రతుకులు సారా సంద్రం లో కలిసిపోవాలి?
యింకెన్ని? యింకెన్ని? యింకెన్ని? యింకెన్ని?





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి