11, మార్చి 2012, ఆదివారం

మద్యం దుకాణం ముట్టడి --కదలివస్తూన్న కాళిలా, మహా కాళి లా




మధ్య వ్యాపారాలు విపరీతమయి, విపత్కరమైన పోకడలెత్తుతూంటే
మితి మీరిన లాభాల కొరకు కుసంస్కారులైతే, అరాచకాన్ని సృష్టిస్తుంటే 
అణగారిన అతివల, అమ్మల పోరాటాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయ్ !

మధ్య వ్యాపారులు మంగళ సూత్రాల్ని కుదువ పెట్టుకొని భర్తలకి బ్రాందీ పోస్తుంటే
గుడి గంటలు కొట్టక ముందే, బడి తలుపులు తెరవక ముందే బార్ తలుపులు బార్లా తెరిచేస్తుంటే
అణగారిన అతివల, అమ్మల పోరాటాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయ్ !!

మందు బాబుల చేష్టలతో ఇంటి ని చక్క బెట్టటం, కష్టమైపోతూంటే
వేరే దారిలేక వీధిలోకి వచ్చి తన వాకిటినీ , వీదినీ సంస్కరించటానికి
అణగారిన అతివల, అమ్మల పోరాటాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయ్ !!!

నడుం కడుతున్నారు, పిడికిలి బిగిస్తున్నారు, కదలివస్తూన్న కాళిలా, మహా కాళి లా
మధ్య మృత్యు కేళి ని మట్టు పెట్టగ , మత్తు కుత్తుక కత్తిరించాటానికి   
అణగారిన అతివల, అమ్మల పోరాటాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయ్ !!!

***     ***    ***  ***     ***    ***   ***     ***    ***   ***     ***    ***

వూరు కొక్క నాయకుడు లేని లోటు వున్న నవ సమాజాన
వూర కుక్క వలె కాటు వేస్తున్నది ఈ నీచపు సారా
వూరకున్నవారి మౌనము, వూరికి అపకారము చేయును
వారు, వీరని జాప్యము తగదు, మధ్యము మీద పోరు చేయ

బెల్ట్ షాపులు పెట్టిన పాపులన్ పాలద్రోల
బెల్టు తీయగ శంసయించ వలదు అమ్మలార
రివోల్టు చేయు భాద్యత, బరువూ మీదే, వేయి 
వోల్టుల శక్తి మీకు వున్నది, శకించ వలదు 

మధ్య మహిషాసురుని అదుపు చేయు కాలమాసన్న మైనది
వుద్యమించుడు వురుములా, కదలి రండో కాళిలా, మహంకాళిలా
చోద్యము చూస్తూ మధ్య వ్యాపారము చేయు ప్రభుత్వాలకు
బాద్యత గుర్తు చేసి, బారుల నేలబారు తనమును అంతము చేయ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి