
ఏవిటో కలి కాలం ! బస్ ప్రయాణీకులకు బొత్తిగా బస్ స్టాఫ్ తో ప్రవర్తించాలో తెలియటం లేదు. అసలు మర్యాదనేది లేకుండా పోయింది.
పై న్యూసు క్లిప్ లో ఉదహరించిన సదరు డ్రైవరు గార్కి డ్యూటీ ఎక్కాలని అసలు మనసు రాక పోయినా కూడా ఎలాగో ఒకలా మనసు చేసుకుని బస్ నడపటానికి వస్తే అడ్డుకుంటారా! అన్నా! ఎంత పొరపాటు !
అసలు ఎలాగో ఒకలా అనటం కూడా తప్పే, ఆ డ్రైవరు గారి కష్టాన్నిఅవమానించటమే. నిజానికి ఎలాగో ఒక లాగా కాకుండా కష్టపడి నాల్గు పెగ్గులు లేదా ఒక అర బాటిల్ లాగించేసీ వచ్చేసాడు డ్యూటీకి. అసలు ప్రయాణీకులు అర్ధం చేసుకోవాలి, ఎంత చేదుగా వున్నా కూడా నాలుగు పెగ్గులు లాగించటము అంటే మాటలా.
అసలు డ్రైవరు గారు ఎందుకు త్రాగి వచ్చాడో అర్ధము చేసుకోవాల్సిన భాద్యత ప్రయాణీకులది. ఆ మాటకొస్తే సకల జనులదీను. ఏదో సరదా కొద్దీ అలా అలా మందు అలవాటయిపోయింది అతనికి. తను మాత్రం ఏంచేస్తాడు.
వీధి వీధి నా పోటీ పడి విస్కీలు , బ్రాందీలూ అమ్మేస్తుంటే ఎలాంటి వాడైనా తట్టు కోగాలడా...తాగ కుండా వుండగలడా. తస్సాదియ్యా ..తాగ కుండ వుండటం అంత వీజీ కాదు ఆంద్ర ప్రదేష్ లో.
అదేనండీ ఆంద్ర ప్రదేష్ ..కొద్దిగా నాక్కూడా గవర్నమెంట్ వారి పుణ్యమా అని ష్ట్రాగటం అలావాటైన నుంచి అలానే పలక గలుగుతున్నా.
అసలు ఎపుడైనా మీరు బస్ డిపో ల ప్రక్కన వుండే కిళ్ళీ కొట్లూ, పాన్ షాపుల్లో చూసారా , మంచినీళ్ళ పాకెట్ల లా చిన్న చిన్న సారా పాకెట్లూ, మిక్చర్ పాకెట్లూ అందరి సౌకర్యార్ధమూ రడీ గా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పరిస్తితుల దృష్ట్యా ఈ డ్రైవరు పాపము నిమిత్త మాత్రుడే. నేరం నాది కాదు ఆకలిది అని అన్నట్లు
త్రాగటం ఆతని నేరము కాదు, ఆంద్ర ప్రదేష్ లో సర్వాంతర్యామి అయిన ఆ మందు దేవత దే .
యిందు
గలదందు లేదని
సందేహంబు వలదు
ఎందెందు వెదుకు బాధే వలదు
సందు సందున మందు కలదు
సందేహంబు వలదు
ఎందెందు వెదుకు బాధే వలదు
సందు సందున మందు కలదు
అంచేత మనకోసం , ప్రయాణీకుల సేఫ్టీ కోసం , తన సొంత డబ్బులతో , చేదు అయినాకూడా పాపం త్రాగి వస్తే అడ్డుకునీ అవమానిస్తారా ! ఎంత మాట ! ఆ మాట కొస్తే త్రాగే వాళ్ళను అడ్డుకోవటం ఆంద్ర ప్రదేష్ ప్రభుత్వ విధానాల్నీ , విధులనూ ఎదుర్కోవటమే, ప్రభుత్వ ధిక్కారమే !
అసలు యిలా త్రాగి డ్యూటి కి వచ్చే వాళ్ళను అడ్డుకునే వాళ్ళని సెక్షన్ VAT 69 కింద అరెస్ట్ చేసి , ప్రాస్సేక్యూట్ చేసి , ఒక సంవత్సరం జైల్లో పడేసీ, పిమ్మట ఒక ఆర్నెల్లు ఏదో ఒక బ్రాందీ బార్ లో పెగ్గులు సర్వింగ్ చేసేట్టు సామాజిక శిక్ష విధిస్తేగానీ తిక్క కుదరు ఈ జనాలకి. ఎంతో డబ్బెట్టి వేలం పాటల్లో మందు షాపు లైసెన్సు లు కొనుక్కున్న మందు కాంట్రాక్టర్ల బతుకులు ఏమి కావాలి? యిలా త్రాగే వాళ్ళను యిబ్బంది పెడితే ? యిలా త్రాగే వాళ్ళను అడ్డుకుంటే ప్రభుత్వ బడ్జెట్ కి డబ్బెలా వస్తుంది? రూపాయికి బియ్యమెలా యిస్తారు? ఎపుడైనా ఆలోచించారా అసలు?
యిక త్రాగి త్రాగి పాపము బీద బిక్కీ వాళ్ళ ప్రేగులు పంక్చర్లు అయినపుడూ , కాలేయాలు కాలిపోయినపుడూ వాళ్ల ప్రేగులకు కుట్లెయ్యటానికి ''రాజీవ్ ఆరోగ్య శ్రీ, 104 , 108 , 109 "' కి డబ్బులివ్వ టానికి నిధులెలా వస్తాయి?
సారే
జాహా సె అచ్చా హిందూస్తాన్ హమారా
సారే ఆంధ్ర స్తాన్ మె నిండి పోయెన్ ‘సారా’
సారే ఆంధ్ర స్తాన్ మె నిండి పోయెన్ ‘సారా’
సరి
రారు మాకెవ్వరూ, సారా పానమున
సారీ, మా బ్రతుకింతే, మా నాయకత్వమూ అంతే
సారీ, మా బ్రతుకింతే, మా నాయకత్వమూ అంతే
chaalaa bagundi.
రిప్లయితొలగించండిThank you so much...
రిప్లయితొలగించండి