10, జనవరి 2012, మంగళవారం

తాగి తూలుతున్న నా దేశం‏

వీధికో బ్రాందీ షాపు, కిళ్ళీ కొట్లో సారా పాకెట్లు, హైవే లో లిక్కర్ షాపులూ,
మందు పార్టీ కోసం మోటారు సైకిళ్ళు దొంగతనం చేసే యువత

తాగి బస్సులూ , లారీలూ నడిపుతున్న యముడి భందు గణం
తాగితే కాని నడవనూ లేని , తాగితే గాని వాహనాన్ని నడపలేని వాళ్ళూ

లిక్కర్ షాపులతో డబ్బు సంపాదించి రాజకీయ నాయకులై
ఆ అధికారంతో మరిన్ని లిక్కర్ షాపులు తెరుస్తున్న నాయకులు

రోజు కూలీ అంతా తాగాటానికే సరిపడక, తాగినంత తాగి
ఇంటికి వచ్చి భార్యని చితక బాదే మగధీరులు

మందు బాగా బొంది లోనికి వెళ్లి లోన దాక్కున్న కామ పిశాచి బయల్పడి
ఏ అడుక్కునే అమ్మాయో కనపడితే కుక్కలా కాటేసే కామం తీరుచుకొనే ఆవారాలూ

ఎక్కడో పక్క వీధిలో కదా, తాగి ఎవడో హత్యో , దొంగతనమో చేసాడు
మన వీధి లో బాగానే వుంది మనకెందుకులే అనుకుని
బ్రతుకు సాగరం లో సాగిపోతున్న సగటు జనం

కొద్ది రోజుల క్రితం విశాఖ లో జరిగిన ఘటన ...
తాగు బోతుకి అప్పు ఇస్తే, వాడు తాగి తాగి అప్పిచ్చిన వాడి కూతుర్నే హత్య చేశాడే
ఇటువంటి సంఘటనలు కూడా బండ బారిన ఏ గుండెనూ తాకట్లేదేమీ ?

ప్రభుత్వం జాలీగా..అపర సంతోషంతో ..ఈల పాటలా లిక్కర్ వేలం పాటలు పాడుతోంది
ప్రభుత్వం జాలి లేకుండా అసుర గుణంతో, అసుర గణంతో పేదల రక్తాన్ని పీల్చే ఆటలు ఆడుతోంది
తాగినోడు, తాగిస్తున్న ప్రభుత్వమూ నీ తోలు తీసి, నీ రక్తాన్ని త్రాగేస్తున్నారు

సమాజం ఎందుకిలా నాయకత్వం లేమితో బావురు మంటోంది ?

మళ్ళీ ఓ గాంధీ వస్తాడా, మళ్ళీ ఓ ఓ సర్దార్ పటేల్ వస్తాడా
తెల్ల వాడి నించి విముక్తిని ప్రసాదించారు ..తాగినోడి నించి తాగిస్తున్న ప్రభుత్వాన్నించీ విముక్తిని ప్రసాదించరా ?

1 కామెంట్‌:

  1. How else do you think the Political Parties can promise and give one Kilogram rice for one rupee!!

    This is what people in general should realise.

    Promising one kilo rice for one rupee is treason in my view.

    రిప్లయితొలగించండి