22, మార్చి 2015, ఆదివారం

రేప్ 'రోజా'కీయాలు


 రేప్ చేయదమ్మున్న వాడెవడు? అన్న ప్రశ్న యేల?
 రేప్ నీవు చేయగలవా? చేయగలవా అనుట యేల?  
  

 రేప్!రేప్! అనుచు యేలనమ్మా ఈ కాకి గోల ?  
 రేపటి రాష్ట్ర స్థితి గతుల గూర్చి ఆలోచన రాదేల?  

 
 తప్ప తాగిన కోతి రీతి శాసన సభన సర్కసు లేల ?
 తప్పు కాద? ప్రజా ధనమునీరీతి భస్మము చేయ?

 
 కప్పగంతులేసి అన్ని పార్టీలు మారుటేల?
 గొప్ప నడవడిక నేర్చి ప్రజాసేవ చేయవేల? 
 
 
టీవిలలోన,సినీమాల్లోన నటియించుట తప్పుగాదు  
 ఠీవి నేర్వక శాసనసభన వదరుట తప్పుకాద? 

 
 పూవుల్లోన రాణీ పువ్వు రోజా కదా!
 నీవునేర్చిన ఈ బాణీ నవ్వులపాలే కదా!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి