అదిగో!అదిగదిగో శాసన సభ
అదే! అదే ! మన ధూషణ సభ
రేయ్! రేయ్! పాతేస్తా! అంటారొకరు
ఎంట్రా!ఎంట్రా! అంటారొకరు
రౌడీ ఎమ్మేల్యేల కండ కావరమది
మేడి పండు వోలు నాయకుల అసలు రూపమిది
పొట్టి శ్రీరాములు మరల మరణించిన రోజు అది
మట్టి గొట్టుకుపోయిన రాజకీయ విలువల రంగు అది
ప్రజా ధనం దహించుకు పోయిన సమయమది
ప్రజల ఆశల మానం శాసన సభన దుశ్శాశన హస్తాల్లో
ప్రమాదానికి బలి అయ్యి హరించిన వేళ అది
వ్యక్తిగత ధూషణలే వారి భాషణలు
వుత్తుత్తి వాగ్ధానాలే వారి భుషణాలు
నవ్యాంధ్రను అంధకారంలో ముంచే చేష్టలవి
సవ్య దారిని చూపలేని అపరికత్వ నాయకత్వమది
అదిగో!అదిగదిగో శాసన సభ
అదే! అదే ! మన ధూషణ సభ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి