స్వచ్చ భారతం... స్వచ్చ భారతం...స్వచ్చ
భారతం...
వచ్చెనెపుడు? వచ్చెనెపుడు? వచ్చెనెపుడు?
తుచ్చుల తుది వచ్చునెపుడు?
త్రాష్టుల కాష్ట మెపుడు ?
భ్రష్టుల భస్మమెపుడు ? భావి
భారత మాతల భ్రూణ హత్యలాగునెపుడు?
వంశాంకురా భరిత భరత రాజనీతి
సంపూర్ణ విస్పోటనమెపుడు?
విమోచనమెపుడు? విచ్చిన్నమెపుడు?
స్వచ్చ భారత సమాజ శుద్ధికి
సామాజిక స్పృహనేల?
కాదే యది మనుజ జన్మకు,
మనుగడకు మానం? కొలమానం ?
రహదారుల, రాజమార్గముల
శుద్ధి తోడ ఏమి ఒసగు ?
నేతలెవ్వరు పోవనట్టి ప్రాదేశముల
పారిశుద్ధి పొసగు రోజు
ఆ రోజు ! ఆ రోజు ! ఆ రోజు !
వచ్చునెపుడు? వచ్చునెపుడు ?
వచ్చునెపుడు ?
స్వచ్చ భారతం... స్వచ్చ భారతం...స్వచ్చ
భారతం...
వచ్చెనెపుడు? వచ్చెనెపుడు? వచ్చెనెపుడు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి