ఒకాయన మూడో పెళ్లి
చేసుకున్నాట్ట..శుభం.
ఎవరి యిష్టం వారిది ..కాదనటానికి మనకి ఏ హక్కూ లేదు.
ఈ కాలం లో ఏదీ తప్పుకాదు..యింకోడి
హక్కులు, డబ్బు కొల్లగొట్టటం తప్ప (ఆ పనికి రక రకాల వేరే రూట్లు వున్నాయి ..రాజకీయాలు, రియల్ ఎస్టేటు...చిట్
ఫండ్ వ్యాపారాలూ లాంటివి.)
సహజీవనంలో ఏ తప్పూ లేదు
స్వలింగ ప్రేమలూ,
పెళ్లిళ్ళూ తప్పు కాదు
రాబోయే కాలంలో కుక్కలతోనూ
వేరే జంతువులతోనూ కూడా పెళ్లి తప్పు కాదన్నా ఆచార్యపోవక్కర్లా.
ఈ వేదికలో ఒకాయన ఓక పోస్టు
వ్రాస్తూ యిలా వాపోయారు : “ఆ మూడు పెళ్ళిళ్ళు చేస్కున్నాయనకి జీవిత భాగస్వామిని
కుదుర్చుకోవటానికే తన జీవితం సరిపోవటంలేదు. ఆయనా, ఆయన “యిజం” వచ్చి తెలుగు ప్రజల్ని
వుద్దరిస్తాయి అనుకున్నాము”
అసలు తెలుగు ప్రజలని ఎవడూ ఉద్దరించలేడని
నా అభిప్రాయం, నమ్మకం.
లేకపోతె, ఎవడో ఒకడు సినిమాల్లో
బాగా నటించేస్తున్నాడని..వాడు ఒక పెద్ద రాజకీయ వేత్త అయిపోతాడని మనం అనుకోవడం ఒక
పిచ్చి కాదా? అందరూ NTR, MGR కాలేరు.
అదేదో రాజ్యం అని చెప్పి ఒక
నటుడు ఒక పార్టీ పెట్టటం, కోడి పెట్టల్లా మొత్తం ఎమ్మెల్యే లందరినీ యింకో పార్టీకి
అమ్మేయటం చూసాం కదా. పంచేలూడదీసి కొట్టాలి అన్నవారు, ఎవరి పంచన చేరారో చూశాము.
ఎవడో వచ్చి వుద్దరిస్తాడని
చూస్తాం కాని, మన కోసం వున్న మంచి నాయకుల్ని మాత్రం పట్టించుకోము.
మొన్న మొన్న వచ్చిన
కేజ్రీవాల్ ని నమ్మి డిల్లీ ప్రజలు పట్టం కట్టారు. కేజ్రీవాల్ కి సమానం లేదా
అంతకన్నా గొప్ప మనిషి మన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్. ఎన్నో ఏళ్ళ క్రితం పార్టీ పెట్టి
కిందా మీద పడుతున్నా మనం ఆ పార్టీ వాళ్లకి వోట్లేయం ..గెలిపించం...(ఆయనొక్కడినీ కనీసం గెలిపించారులెండి )
కాని ఎదో యిజం
వస్తుంది ఎదో చేస్తుంది అని చూస్తాం.
మనందరికీ ఓ తిక్కుంది...దానికేలెక్కా లేదు
baagaa raasaaru. telugu jathi ippatikaina melu kovali
రిప్లయితొలగించండి