మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి అన్న నానుడికి సరి అయిన ఉదాహరణ నేటి నట వారసులు .
అసలు నట వారసులు ఏంటో ! ఎవరికీ అర్ధం కాని లుచ్చా బాష యిది.
ఐన్ స్టైన్ కొడుకు ఐన్ స్టైన్ కాలేదు. కొడుకు అయినంత మాత్రాన తండ్రి ప్రతిభ కొడుకు కి వచ్చి వాలి పోదు.
స్టూడియో లు వారివి, నిర్మాతలు వాళ్ళు, సినీమా రిలీజు చేసుకోవటానికి డిస్ట్రి బ్యూటర్లు వాళ్ళే. టివి చానళ్ళూ వారివే
అంతవరకూ బాగానే వుంది కానీ, నట విరాట్లూ మేమే నంటే నే చిక్కు, ముప్పు, తప్పు.
అబద్దాలు చెప్పి, మసి పూసి మారేడు కాయ చేసి, ప్రేక్షకునిగా ఎదగనీయకుండా చేసి, వారి ప్రతీ సినీమా ఒక సంచలనం , నభూతో నభవిష్యతి, దిబ్బ దిరుగుండం అని చెప్పి
ప్రేక్షకుల్ని మభ్య పెట్టి , మాయ చేసి పబ్బం గడుపు కుంటున్నాయి, ఈ నట వట విష వృక్ష కుటుంబాలు.
ఏమి ఒక డైరక్టర్ ఎందుకు కారు ఈ వారస యోధులు ? ఒక మాటల రచయిత, లేక పొతే ఒక గేయ రచయిత ఎందుకు కారు ? అప్పనంగా హీరోలు మాత్రం అయిపోతారు ఈ జీరోలు.
ఒక NTR , ఒక ANR , వచ్చారు ..తెలుగు సినిమాకు వెలుగు నిచ్చారు ..
కానీ వాళ్ళ వారసులమని వారి కొడుకులు, మనమలు యింకో నిజ మయిన NTR ను , యింకో నిజ మయిన ANR ను తెలుగు సినీమాకు రానీయకుండా, కానీయకుండా చేసారు.. చేస్తునారు.
అలనాడు పామరులను పాలేర్లు గా చేసుకొని వెట్టి చాకిరీ చేయించుకొన్న ఆ తెలివి తేటలే, ఈ రోజు సగటు ప్రేక్షకుని మభ్య పెట్టి , ప్రేక్షకునిగా ఎదగనీయకుండా చేసి పబ్బం గడుపు కుంటున్నాయి.
ఒక రకంగా చూస్తె తెలివి అయిన తెలుగు సినీ మాఫియా యిది. ప్రేక్షకులు నిజంగా 'ప్రేక్షకుడు' మాత్రమే ఈ రోజు. ప్రేక్షకుడు కి ఈ రోజు చాయిస్ లేదు. నిజమయిన నటులకు చాన్సూ లేదు.
రాచరికపు వ్యవస్తలా మారి పోయింది సినీ పరిశ్రమ.
ఈ నట వట విష వృక్షాల కభంద హస్తాలనుండి తెలుగు సినిమా ఎపుడు బయట పడుతుందో తెలియదు. కేవలం అయిదు కుటుంబాల అర చేతుల్లో తెలుగు సినీమా బందీ అయిపొయింది.
ప్రేక్షకులు 'ప్రేక్షక' పాత్రకే పరిమిత మవకుండా ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. టివి చానళ్ళ ప్రమోషన్ వరద లో కొట్టుకు పోకుండా స్వతహాగా సినీమా ను విశ్లే షించుకోవాలి
నట వారస అసురల నుండి, నట వట విష వృక్ష కుటుంబాల నుండి తెలుగు సినీమా విముక్తి అయే రోజు రావాలి.

aa prekshakule, kula gajjitono, maredo durada tono, abhimana sanghaalu pettukuni, aa vaarasulaki haarati padutunnaru. tappu varidi koodaa undi mari!!
రిప్లయితొలగించండితప్పు ఎవరు చేసినా తప్పే...అందుకే ప్రేక్షకులు ఎదగాల్సిన అవసరం వుంది అనేది.
రిప్లయితొలగించండికత్తిలాంటి మాటలు చెప్పారు. వంశపారంపర్యంగా సంక్రమించడానికి కళలేమైనా తాతలు సంపాదించిన ఆస్తులా ? కాదని చెప్పడానికి లవకుశలోంచీ ఎన్టీరామరావుని తీసేస్తే బాలకృష్ణ భోరుమనడంతప్ప సినిమా ఏమైనా బాగుందా ? బాగున్నవన్నీ బాపుగారి ఫ్రేములేగానీ బాలకృష్ణగారివి ఎంతమాత్రం కాదు. ఇంక జూనియర్ ఎన్టీఆరయితే రాముడిగా ఊహకే అందడు. హీరోయిజం బండ బారిపోయిందనడానికి ఎన్టీఆర్ కుటుంబం ఎంత పెద్ద ఉదాహరణో ఏ ఎన్నార్ కుటుంబం అంతకంటె పెద్ద ఉదాహరణ.
రిప్లయితొలగించండిరాణి.